PAVITHROTSAVAMS CONCLUDE WITH POORNAHUTHI IN SRI GT _ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు
Tirupati, September 05, 2025: The three-day Pavithrotsavams at Sri Govindarajaswamy Temple in Tirupati concluded grandly on Friday with the performance of Poornahuti.
From 11:00 a.m. to 12:30 p.m., Snapana Tirumanjanam was conducted with milk, curd, honey, sandal paste, tender coconut water, and various fruit juices, offered ceremoniously to the deities.
In the evening, from 5:30 p.m. to 6:30 p.m., the processional deities were taken out in a grand Tiruveedhi Utsavam. Later, from 7:30 p.m. to 9:30 p.m., Vedic rituals, Poornahuti, Prabandha Sattumora, and Veda Sattumora were observed at the Yagashala. From 9:30 p.m. to 10:30 p.m., the deities and the holy Kalasa were ceremoniously brought back to the main sanctum in a Vimana Pradakshinam.
Sri Sri Sri Pedda Jeeyangar, Sri Sri Sri Chinna Jeeyangar, Temple Deputy EO Smt. V.R. Shanthi, AEO Sri A.B. Narayana Chowdhary, temple priests were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
పూర్ణాహుతితో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2025, సెప్టెంబర్ 05: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 11.00 గం.ల నుండి 12.30 గం.ల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు.
తదుపరి సాయంత్రం 5.30 గం.ల నుండి 6.30 గం.ల వరకు ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం, అనంతరం రాత్రి 07.30 గం.ల నుండి 09.30 గం.ల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ప్రబంధ శాత్తుమొర, వేద శాత్తుమొర చేపడతారు. రాత్రి 9.30 నుండి 10.30 గం.ల వరకు ఉత్సవ మూర్తులు, కుంభం విమాన ప్రదక్షిణంగా సన్నిధికి వేంచేపు చేస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయంగార్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయంగార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏ.బీ నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




