PARAMAPADANADHA BLESSES DEVOTEES ON PEDDA SESHA _ పెద్దశేష వాహనంపై పరమపద నాధుడు అలంకారంలో సిరులతల్లి
TIRUPATI, 18 NOVEMBER 2025: On the second morning as a part of ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor, Sri Padmavati Devi blessed Her devotees as Paramapadanada on the mighty Pedda Sesha Vahanam.
The seven hooded serpent king believed to be Adisesha carried the Goddess along mada streets to bless devotees who cherished the vahanam amidst rain.
Both the Pontiffs of Tirumala, EO Sri AK Singhal, JEO Sri Veerabrahmam, CVSO Sri Muralikrishna, DyEO Sri Harindranath and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
పెద్దశేష వాహనంపై పరమపద నాధుడు అలంకారంలో సిరులతల్లి
తిరుపతి 2025 నవంబరు 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.
రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
వాహన సేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, పలువురు అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.






















