PEDDA SESHA VAHANAM ON DAY ONE ANNUAL FETE _ పెద్దశేష వాహనంపై వైకుంఠనాధుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి

TIRUPATI, 07 JUNE 2025: Pedda Sesha Vahana Seva on the first evening of the ongoing annual brahmotsavams at Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta on Saturday.

The Utsava deities of Sri Prasanna Venkateswara along with Sridevi and Bhudevi were taken for a celestial ride along the four mada streets encircling the temple.

The devotees are thrilled to witness the deities on the giant seven-hooded divine serpent carrier.

DyEO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Smt Srivani and others were present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

పెద్దశేష వాహనంపై వైకుంఠనాధుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి

తిరుపతి/అప్పలాయగుంట, 2025, జూన్ 07: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శనివారం రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వైకుంఠనాధుడి అలంకారంలో భక్తులను క‌టాక్షించారు.

ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు.

వాహన సేవలో డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈఓ శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఆలయ అర్చకులు , శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.