PEDD SESHA VAHANAM AT SKVST _ పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయణుడి అలంకారంలో శ్రీనివాసుడు
Tirupati, 20 Feb. 22: The annual Brahmotsavams of Srinivasa Mangapuram witnessed the first vahana Seva on its series of vahanams with Pedda Sesha Vahanam on Sunday evening.
Sri Kalyana Venkateswara flanked by Sridevi and Bhudevi were seated on the seven hooded Pedda Sesha Vahanam.
Due to Covid restrictions, the vahana seva took place in Ekantam.
JEO Sri Veerabrahmam, DyEO Smt Shanti, AEO Sri Gurumurthy, Superintendents Sri Ramanaiah, Sri Chengalrayalu, temple priest Sri Balaji Rangacharyulu were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయణుడి అలంకారంలో శ్రీనివాసుడు
తిరుపతి, 2022 ఫిబ్రవరి 20: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఆదివారం రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహనసేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది.
ఏడుపడగలు గల ఆదిశేషుడు ఏడుకొండలకు, ఏడు లోకాలకు సంకేతం. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శ్రీవారికి విశ్రాంతి, సుఖనిద్ర ఇస్తున్నాడు.
ఈ వాహన సేవలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి,సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయులు, శ్రీరమణయ్య,, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.