BADRI NARAYANA ENTHRALLS _ పెద్దశేష వాహనంపై శ్రీ బద్రి నారాయణుడి అలంకారంలో సిరులతల్లి
TIRUPATI, 11 NOVEMBER 2023: On the second day of the ongoing annual brahmotsavam in Tiruchanoor on Saturday morning, Sri Padmavathi Devi as Badri Narayana blessed Her devotees on Pedda Sesha Vahanam.
Both the seers of Tirumala, TTD Chairman Sri Karunakara Reddy, Chandragiri MLA Sri Bhaskar Reddy, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan and others were present
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
పెద్దశేష వాహనంపై శ్రీ బద్రి నారాయణుడి అలంకారంలో సిరులతల్లి
తిరుపతి, 2023 నవంబరు 11: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై శ్రీ బద్రి నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.
రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎం.ఎల్.ఎ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, విజివో శ్రీ బాలి రెడ్డి, ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరిండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్ శ్రీ గణేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.