PEDDA SESHA VAHANAM HELD _ పెద్ద‌శేష వాహ‌నంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

TIRUPATI, 10 JUNE 2022: As a part of the ongoing annual brahmotsavam at Appalayagunta near Tirupati, Pedda Sesha Vahana seva was held on Friday evening.

The Vahan sevas during the 9 day fete commenced with the mighty serpent vahanam.

Temple DyEO Sri Lokanatham, Superintendent Smt Srivani, Kankanabhattar Sri Suryakumaracharyulu and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పెద్ద‌శేష వాహ‌నంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుమల, 2022 జూన్ 10: అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్ర‌వారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నాధుడి అలంకారంలో కటాక్షించారు.

శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు.

వాహ‌న‌సేవ‌లో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి శ్రీ‌వాణి, కంకణభట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల