NAKSHATRA SATRA MAHA YAGAM FOR WELFARE OF HUMANITY _ ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం నక్షత్రసత్ర మహాయాగం : శ్రీ కెఎస్ఎస్ అవధాని

Tirumala, 9 May 2021: The spiritual crusade of TTD for the well-being of humanity and protection from pandemic Covid reached a new high on Sunday morning with the beginning of Nakshatra Satra Maha Yagam at the Dharmagiri Veda Pathashala.

Principal of the Dharmagiri Veda vijnan peetham Sri KSS Avadhani said, as part of the Maha Yagam the Shrouta yagas of purvangabhutas will be performed onMay9-11. 

Speaking on the occasion Sri Avadhani said the Maha yagam performed for well being of global humanity will last till June 15.

From May 12 onwards the Shrouta yagas of all devatas of 28 nakshatras from Kruthika naksatram to Bharani Naksatram and Abhijeet naksatram will be performed. Thereafter Shrouta yagas will also be performed for Chandra, Ahoratramulu, Usha Kala, and Nakshatra samanyamu, Surya Bhagavan, Aditi and Vishnu etc.

Legends say that since every person is born in any of 27 naksatram in the world, the yagas will protect every one of them. The yagas commenced on Vaisakha shudda Padhyam day (today) during the confluence of Rohini and Kritika naksatram.

Sri Avadhani appealed to devotees to beget the divine fruits of the yagas by witnessing the sacred rituals Live telecast on SVBC.

Meanwhile on Sunday from 11.00 am-2.00 pm the rituals of Vichinnadanam, Agnihotram will be observed and the Yaga programs will continue 6.00- 8.00 pm in the evening.

Acharyas of Dharmagiri Veda Pathashala and other Rutwicks were present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం నక్షత్రసత్ర మహాయాగం : శ్రీ కెఎస్ఎస్ అవధాని

తిరుమల, 2021 మే 09: కరోనా వ్యాధిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం నక్షత్రసత్ర మహాయాగం నిర్వహిస్తున్నట్టు ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్ అవధాని తెలిపారు. జూన్ 15వ తేదీ వరకు జరుగనున్న ఈ మహాయాగం ప్రారంభ కార్యక్రమం ఆదివారం ధర్మగిరి వేద పాఠశాలలో జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ అవధాని మాట్లాడుతూ మే 9, 10, 11వ తేదీల్లో పూర్వాంగభూతములైన శ్రౌతయాగాలు నిర్వహిస్తామని తెలిపారు. మే 12 నుండి కృత్తికా నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు అభిజిత్ నక్షత్రం సహా 28 నక్షత్రాల అధిష్టాన దేవతలకు శ్రౌతయాగాలు నిర్వహిస్తామని వివరించారు. ఆ తరువాత చంద్రుడు, అహోరాత్రములు, ఉషఃకాలం, నక్షత్ర సామాన్యము‌, సూర్య భగవానుడు, దేవమాత అయిన అదితి, యజ్ఞ స్వరూపుడైన విష్ణువుకు శ్రౌతయాగాలు నిర్వహిస్తామన్నారు. ప్రపంచంలోని ప్రజలందరూ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటారని, ఈ యాగాల ద్వారా ఆయా అధిష్టాన దేవతలు తృప్తి చెంది విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తారని చెప్పారు. వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు రోహిణి సంధితో కూడిన కృత్తికా నక్షత్రం రావడం అరుదని, ఈ సందర్భంలో మాత్రమే ఈ యాగాలు నిర్వహిస్తారని తెలియజేశారు. ఎస్వీబీసీ ద్వారా భక్తులందరూ ఈ యాగాలను తిలకించి ఫలితం పొందాలని కోరారు.

కాగా, ఆదివారం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విచ్ఛిన్నాధానం, అగ్నిహోత్రం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అగ్నిహోత్రం యాగ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, ఋత్వికులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.