THREE MORE TAKES OATH _ ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ధర్మకర్తల మండలి సభ్యులు
Tirumala, 07 November 2024: Three more members took oath as members of the TTD Trust Board on Thursday morning.
The members included Sri Bhanu Prakash Reddy, Sri Muni Koteswara Rao and Smt. Suchitra Ella.
TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary administered the oath to them in the presence of Sri Venkateswara Swamy at Tirumala Temple.
After the darshan of the Srivaru, Vedic scholars offered blessings in the Ranganayakula Mandapam.
Later, the Additional EO handed over the Tirtha Prasadams and the portrait of Srivaru along with Diaries and calendars.
Deputy EOs Sri Lokanatham, Sri Bhaskar and others participated in the program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ధర్మకర్తల మండలి సభ్యులు
తిరుమల, 2024 నవంబరు 07: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా గురువారం ఉదయం ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ ముని కోటేశ్వరరావు, శ్రీమతి సుచిత్ర ఎల్లా ఉన్నారు.
శ్రీవారి ఆలయంలోని స్వామివారి సన్నిధిలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అడిషనల్ ఈవో అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.