SRINIVASA KALYANAM FETE HELD AT MAHAKUMBH, PRAYAGRAJ _ ప్రయాగ్ రాజ్ లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

Tirumala, February 06, 2025: On the occasion of the Maha Kumbh Mela, at Prayagraj TTD organized a grand Sri Srinivasa Kalyanam on fete on Thursday at the ISKCON camp in Sector-19, Prayagraj.

First, a group of priests brought the Utsava idols of Sridevi, Bhudevi and Sri Swamy to the venue.

Afterwards, from 11 am to 12 noon, the  Kalyanaotsavam of Sri Swami Ammavar was performed according to the scriptures, with the priests chanting Vedic mantras  and Mangala vadyams  and other rituals, 

Finally, the ceremony concluded with the Nakshatra Aarti and Mangala Aarti and the devotees who witnessed the celestial ceremony were filled with devotion.

Deputy EO Sri Siva Prasad, HDPP Additional Secretary Sri Ram Gopal, AEO Sri Ravi and other officials were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రయాగ్ రాజ్ లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

తిరుమల, 2025 ఫిబ్రవరి 06: మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని సెక్టార్-19లో గల ఇస్కాన్ క్యాంపులో గురువారం శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది.

ముందుగా అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.

అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు.

చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్, హెచ్ డీపీపీ అదనపు సెక్రటరీ శ్రీ రామ్ గోపాల్, ఏఈవో శ్రీ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.