SRINIVASA KALYANAM CELEBRATED IN PRAYAG RAJ _ ప్రయాగ్ రాజ్ లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
Tirumala, 26 January 2025: Srinivasa Kalyanam was organised by TTD in the temple of Sri Lakshmi Venkateswara Devasthanam set up by Bhakti Vatika Seva camp in Devaria, Sector-8, Prayag Raj, on Sunday.
First, a team of priests led by the one of the Mukhya Archakas of Tirumala Temple Sri Rajesh Deekshitulu brought the utsava deities of Sri Swami along with Sridevi and Bhudevi to the Kalyana venue.
Beginning with Vishvaksena Aradhana, Punyahavacanam, Kankana Dharana, Agni Pratistapana, Sankalpam, Mangala Sutradharana, organised in a grand manner.
Finally, the Kalyanam concluded successfully with Nakshatra Harati and Mangala Harati offered to the deities.
Devotees who witnessed the auspicious occasion of Srivaru and Ammavarlu were thrilled with devotion.
Jagadguru Sri Ramanujacharya, Swami Rajanarayanacharya, HDPP Additional Secretary Sri Ram Gopal, AEO Sri Prabhakar Reddy, Bokkasam in-charge Sri Gururaja Swamy and other officials participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ప్రయాగ్ రాజ్ లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
తిరుమల, 2025 జనవరి 26: మహా కుంభమేళా సందర్భంగా దేవరియాలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర దేవస్థానంవారు ప్రయాగ్ రాజ్ లోని సెక్టార్-8లో ఏర్పాటు చేసిన భక్తి వాటికా సేవా శిబిరంలో ఆదివారం శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది.
ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చుకులు శ్రీ రాజేష్ దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు.
చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడం తో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు.
ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీరామానుజాచార్యస్వామి రాజనారాయణాచార్య, హెచ్ డీపీపీ అడిషనల్ సెక్రటరీ శ్రీ రామ్ గోపాల్, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.