CHATURVEDA SABHA IN FEBRUARY-(H&E) _ ఫిబ్రవరిలో ప్రముఖ పండితులతో చతుర్వేద సభ – జేఈవో శ్రీమతి సదా భార్గవి
ఫిబ్రవరిలో ప్రముఖ పండితులతో చతుర్వేద సభ – జేఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2023 నవంబరు 21: లోక కళ్యాణార్థం తిరుపతిలో 2024 ఫిబ్రవరి నెలలో దేశంలోని ప్రముఖ పండితులతో చతుర్వేద సభ ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం జేఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో నిర్వహించే చతుర్వేద సభకు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1300 మంది ప్రముఖ వేద పండితులు, అహితాగ్నులు, స్కీం పారాయణదారులను ఆహ్వానించాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, గార్డెన్, ఆరోగ్య, వసతి, రవాణా తదితర విభాగాలు ఏర్పాట్లపై ఇప్పటి నుండి తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, సిఏఓశ్రీ శేషశైలేంద్ర, అదనపు ఎఫ్ ఏసిఏఓ శ్రీ రవి ప్రసాదు, డిపిపి కార్యదర్శి శ్రీ సోమయాజులు, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirupati, 22 November 2023: The TTD JEO for Health and Education Smt Sada Bhargavi directed officials to organise a grand Chaturveda Sabha with eminent scholars in February 2024 for promoting Universal Harmony.
Addressing a review meeting at the TTD Administrative Building on Tuesday the JEO said as many as 1300 Vedic scholars, Ahitagnis and scheme Parayanadars will be invited to participate in the Parade Grounds behind the TTD Administrative Building.
She directed the engineering, electrical, garden, health, reception and transport officials to prepare action plans to organise the program in a big way.
SVVedic University VC Acharya Rani Sadasiva Murthy, CAuO Sri Sesha Shailendra, Additional FA & CAO Sri Ravi Prasadu, HDPP Secretary Sri Srinivasulu, Annamacharya Project Director Dr Vibhishana Sharma were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI