SPECIAL CELEBRATIONS AT SRI KODANDA RAMALAYAM IN FEBRUARY _ ఫిబ్ర‌వ‌రిలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 30 January 2025: Many special festivals will be held in the month of February at Sri Kodanda Rama Temple in Tirupati.  
 
Their details are as follows.
 
 February 1st, 8th, 15th and 22nd on Saturdays at 6 am, Sri Sita Rama Lakshmana Moola Moortis Abhishekam will be performed.  
 
Devotees can participate in the Abhishekam by paying Rs.20/-.  
 
At 5.30pm, a procession of Swami and Ammavaru on Tiruchi is held in the four Mada streets of the temple, followed by an Unjal Seva at the temple at 7 pm. 
 
 February 10- Kalyanam of Sri Sitarama will be performed at 11 am on the advent of Punarvasu Nakshatram.  
 
At 5.30 pm procession to Sri Ramachandra Pushkarini.  Unjal seva will be performed at 6.30 pm.  Grihastas (two) can participate by paying Rs.500/-.
 
February 13- Kupuchandrapet festival 
 
February 28-Sahasra Kalasabhishekam on the occasion of Amavasya.  
 
Grihastas (two) can participate by paying Rs.500/-.  Hanumanta Vahanaseva will be held at 7 pm.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

ఫిబ్ర‌వ‌రిలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2025 జనవరి 30: తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్ర‌వ‌రి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– ఫిబ్ర‌వ‌రి 1, 8, 15, 22వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– ఫిబ్ర‌వ‌రి 10న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీ రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద‌కు ఊరేగింపుగా తీసుకెళ‌తారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఊంజ‌ల్‌సేవ నిర్వ‌హిస్తారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు.

– ఫిబ్ర‌వ‌రి 13న పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారికి కూపుచంద్రపేట ఉత్స‌వం వైభ‌వంగా జరుగనుంది.

– ఫిబ్ర‌వ‌రి 28న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఉంది పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.