KUPCHANDRA PETA FESTIVAL ON FEBRUARY 10 _ ఫిబ్రవరి 10న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు
Tirupati, 6 Feb. 20: As per the tradition, on Magha masam Pournami day, the utsava idols of Sri Kodandarama Swamy along with Sita Devi and Lakshmana Swamy will be taken in a procession to Kupuchandrapeta, 8 kms from Tirupati on February 10.
Snapana Thirumanjanam and unjal seva to utsava idols will be performed at the village and later in the evening the deities will return to temple.
During the procession the artists of HDPP and Dasa Sahitya Project will will perform bhajans, kolatas etc.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 10న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు
తిరుపతి, 2020 ఫిబ్రవరి 06: తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 10వ తేదీ కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.
శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6.00 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటాయి. అక్కడ ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు ఊంజలసేవ, సాయంత్రం 5.00 గంటలకు అక్కడి నుండి బయల్దేరి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.