PETA UTSAVAM OF SRI KODANDA RAMA _ ఫిబ్రవరి 13న శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం
Tirupati, 11 February 2025: The Peta Utsavam of Sri Kodandarama Swamy in Tirupati will be celebrated on February 13.
On the auspicious occasion of Magha Pournami, it is customary to take the ceremonial idols of Kodanda Rama Swamy along with Sri Seethalakshmana in a procession to Kupchandrapeta village.
At 6 am, the Utsavamurti of Swami and Ammavarlu leaves the temple in a procession and reach Kupuchandrapet, 8 km from Tirupati. Snapana Tirumanjanam and Asthanam will be held there from 10 am to 11.30 am.
After that, Unjalseva from 4 to 5 pm, Gramotsavam from 5 pm to 9 pm will be observed and later the utsavarulu reaches back to the temple
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరి 13న శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 11: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం ఫిబ్రవరి 13వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.
ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపుగా బయలుదేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంటుంది. అక్కడ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు.
అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ, సాయంత్రం 5 నుండి బయల్దేరి రాత్రి 9 గంటల వరకు గ్రామోత్సవం, తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.