KUNDA KUSUMARCHANA IN DHYANARAMAM ON FEB 15 _ ఫిబ్రవరి 15న ధ్యానారామంలో కుంద కుసుమార్చన

Tirupati, 14 Feb. 21: As a part of Magha Masa festivities mulled by TTD Kunda Kusumarchana will be observed on Monday evening at Dhyanaramam in SV Vedic varsity premises in Tirupati.

Unique Abhsihekam with jasmines will be rendered to the mammoth Shiva Linga located here by chanting Trisati Namams of Lord.

This pooja will invoke the blessings by appeasing Rudra Roopa of Lord Shiva and protect the humanity from calamities and dreadful diseases.

This programme will be telecasted live on SVBC between 7pm and 8pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్రవరి 15న ధ్యానారామంలో కుంద కుసుమార్చన

తిరుపతి, 2021 ఫిబ్రవరి 14: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ టిటిడి నిర్వహిస్తున్న మాఘ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఫిబ్రవరి 15న కుంద కుసుమార్చన జరుగనుంది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల  ధ్యానారామంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. శ్రీ వేంకటేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది.

కుంద కుసుమాలు అనగా మల్లెపూలు. మాఘ మాసంలో మల్లెపూలు పూయడం ప్రారంభమవుతాయి. ఇలా ఈ రుతువులో కొత్తగా వచ్చిన మల్లెపూలతో మహాశివుడిని అర్చించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. కుసుమార్చనతోపాటు 300 మంత్రాలు గల రుద్ర త్రిశతిని ఈ సందర్భంగా పండితులు పఠిస్తారు. రుద్రుడు అగ్ని స్వరూపుడు. కుంద కుసుమాలతో అర్చించడం వల్ల ఆయనకు ఉపశమనం కలిగి శాంతిస్తాడు. కుంద కుసుమార్చన వల్ల తీవ్రమైన స్వభావాలు, కలహాలు, వ్యాధి బాధలు లాంటి అవలక్షణాలు తొలగిపోయి ప్రపంచ శాంతి చేకూరుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.