KOIL ALWAR TIRUMANJANAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE ON FEB 15 _ ఫిబ్రవరి 15న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Tirupati, Koil Alwar Tirumanjanam will be held on February 15 at Sri Kapileswara Swamy temple in Tirupati.  

The annual Brahmotsavam will be held in the temple from February 19 to 28.

As part of this, Koil Alwar Tirumanjanam will be held on February 15 from 11.30 am to 3 pm.  On this occasion, the entire temple and puja materials are purified and propitiated with spices.  

Sarvadarshan commences from 8 am to 11 am and again from 3 pm to 8 pm.

Brahmotsava Vahanams:

 19-02-2025

Morning -Dhwajarohanam  Night – Hamsa

20-02-2025

Morning-Surya Prabha Vahanam Night-Chandra Prabha Vahanam

21-02-2025

Morning – Bhoota Vahana  Night – Simha 

22-02-2025

Morning – Makara Vahanam Night – Sesha 

23-02-2025  

Morning – Tiruchi Utsavam Night – Adhikara Nandi Vahana

24-02-2025

Morning – Vyaghra Vahana Night – Gaja Vahana

25-02-2025

Morning – Kalpavriksha Vahana Night – Aswa Vahana

26-02-2025

Morning – Rathotsavam (Bhogiteru) Night – Nandi Vahana

27-02-2025

Morning – Purushamrugha Vahana Evening – Kalyanotsavam

 Night – Tiruchi Utsavam 

28-02-2025

Morning – Trisula Snanam Evening – Dhwajavarohanam 

Night – Ravanasura Vahana

Every day the Vahana Sevas will be held from 7 am to 9 am and again from 7 pm to 9 pm during Brahmotsavam.

TTD Hindu Dharma Prachara Parishad will organize Kolatam and Bhajan programs daily before Vahanams.  

Artists of the Annamacharya Project will sing Annamayya Sankeerthans.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్రవరి 15న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి, 2025 ఫిబ్రవరి 11: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 19 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 15న ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

19-02-2025

ఉద‌యం – ధ్వజారోహణం

రాత్రి – హంస వాహనం

20-02-2025

ఉద‌యం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

21-02-2025

ఉద‌యం – భూత వాహనం

రాత్రి – సింహ వాహనం

22-02-2025

ఉద‌యం – మకర వాహనం

రాత్రి – శేష వాహనం

23-02-2025

ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం

రాత్రి – అధికారనంది వాహనం

24-02-2025

ఉద‌యం – వ్యాఘ్ర వాహనం

రాత్రి – గజ వాహనం

25-02-2025

ఉద‌యం – కల్పవృక్ష వాహనం

రాత్రి – అశ్వ వాహనం

26-02-2025

ఉద‌యం – రథోత్సవం (భోగితేరు)

రాత్రి – నందివాహనం

27-02-2025

ఉద‌యం – పురుషామృగవాహనం

సాయంత్రం – కల్యాణోత్సవం,

రాత్రి – తిరుచ్చి ఉత్సవం

28-02-2025

ఉద‌యం – త్రిశూలస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం,

రాత్రి – రావణాసుర వాహనం

బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది