ఫిబ్రవరి 15వ తేది నుండి 23వ తేది వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోతవాలు

ఫిబ్రవరి 15వ తేది నుండి 23వ తేది వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోతవాలు

తిరుపతి ఫిబ్రవరి-13,2009: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోతవాలు ఫిబ్రవరి 15వ తేది నుండి 23వ తేది వరకు కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించాల్సిన ఆర్జితసేవలను రద్దు చేశారు. అదే విధంగా ప్రతిరోజు తి.తి.దే, ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.