ANNUAL BRAHMOTSAVAMS OF SRI VENKATESWARA SWAMY AT TONDAMANPURAM FROM FEBRUARY 16 TO 24 _ ఫిబ్ర‌వ‌రి 16 నుండి 24వ తేదీ వరకు తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 05 February  2026: The annual Brahmotsavams of Sri Prasanna Venkateswara Swamy, along with Sridevi and Bhudevi, will be conducted at Tondamanpuram from February 16 to 24.

As part of the festivities, Ankurarpanam will be performed on February 15 at 6 p.m. The Brahmotsavams will commence with Dhwajarohanam on February 16 between 9.15 a.m. and 9.45 a.m. in Meena Lagnam. 

The Vahana Sevas will be conducted every night from 7p.m. to 8.30 p.m. during the Brahmotsavams.

February 16: Peddasesha

Vahanam 

February 17 – Hamsa Vahanam

February 18 – Simha Vahanam

February 19 – Hanumantha Vahanam

February 20 – Kalyanotsavam at 5.00 p.m., followed by Garuda Seva in a grand manner at night

February 21 – Gaja Vahana

February 22 – Chandraprabha Vahanam

February 23 – Morning Tiruchi Utsavam and Night Ashwa Vahanam

On February 24, Chakrasnanam will be observed from 9.30 a.m. to 11.30 a.m., followed by Dhwajavarohanam from 6.30 p.m. to 8p.m.

Pushpayagam will be performed on February 25 at 5.30 p.m.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 16 నుండి 24 తేదీ వరకు తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2026 ఫిబ్రవరి 05: తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 16 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ఫిబ్ర‌వ‌రి 15న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 16న ఉదయం 9.15 నుండి 9.45 గంటల మధ్య మీన ల‌గ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 7 గంట‌ల‌కు శేష వాహన సేవ నిర్వహిస్తారు. ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జ‌రుగ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 17న హంస వాహనం, ఫిబ్ర‌వ‌రి 18న సింహ వాహనం, ఫిబ్ర‌వ‌రి 19న హనుమంత వాహనం, ఫిబ్ర‌వ‌రి 20న సాయంత్రం 5 గంట‌ల‌కు కల్యాణోత్సవం, రాత్రి గరుడ సేవ అత్యంత వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి.

ఫిబ్ర‌వ‌రి 21న గజవాహనం, ఫిబ్ర‌వ‌రి 22న చంద్రప్రభ వాహనం, ఫిబ్ర‌వ‌రి 23న ఉదయం తిరుచ్చి, రాత్రి ఆశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 24న ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఫిబ్ర‌వ‌రి 25న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరగనుంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.