BRAHMOTSAVAMS AT SRINIVASA MANGAPURAM FROM FEB 20-28 _ ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 02 February 2022: TTD is organising the annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram from February 20-28 with all vahana sevas in Ekantha as per covid guidelines and Ankurarpanam fete will be observed on February 19.

 

TTD is organising the Koil Alwar Thirumanjanam at the Sri Kalyan Venkateswara Swami temple on February 15 ahead of the annual Brahmotsavam celebrations.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 02: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

20-02-2022(ఆదివారం) ధ్వజారోహణం(మీన‌ల‌గ్నం) పెద్దశేష వాహనం

21-02-2022(సోమ‌వారం) చిన్నశేష వాహనం హంస వాహనం

22-02-2022(మంగ‌ళ‌వారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

23-02-2022(బుధ‌వారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

24-02-2022(గురువారం) పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

25-02-2022(శుక్ర‌వారం) హనుమంత వాహనం స్వర్ణరథం(తిరుచ్చి), గజ వాహనం

26-02-2022(శ‌నివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

27-02-2022(ఆదివారం) రథోత్సవం(సర్వభూపాల వాహనం) అశ్వవాహనం

28-02-2022(సోమ‌వారం) చక్రస్నానం ధ్వజావరోహణం

ఫిబ్రవరి 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 15వ తేదీ మంగ‌ళ‌వారం ఉదయం 6 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.