KOIL ALWAR TIRUMANJANAM IN SKVST ON FEBRUARY 23 _ ఫిబ్రవరి 23న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 21 Feb. 21: The Koil Alwar tirumanjanam in Srinivasa Mangapuram Temple will be observed on February 23 in connection with the annual brahmotsavam from March 2 to 10 which will be held in Ekantam.
This religious event will take place in the temple between 6 a.m. and 10 a. m. on Monday. Later the devotees will be allowed for Darshan.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఫిబ్రవరి 23న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2021 ఫిబ్రవరి 21: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 23వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.