ఫిబ్రవరి 24వ తేది నుంచి 28వ తేది వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

ఫిబ్రవరి 24వ తేది నుంచి 28వ తేది వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుమల, 2010 ఫిబ్రవరి 11: తిరుమలలో ఈనెల 24వ తేది నుంచి 28వ తేది వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు.  

ఈ తెప్పోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో జరిగే వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దుచేసారు. అదేవిధంగా 26వ తేది నుంచి 28వ తేది వరకు బ్రహ్మోత్సవం సేవను కూడా రద్దుచేసారు.

ఈ తెప్పోత్సవాలలో పాల్గొనదలచిన భక్తులు రూ.2500/- చెల్లించి 5 మంది భక్తులు పాల్గొన వచ్చును.

ప్రతి ఏటా శ్రీస్వామి పుష్కరిణిలో ఫాల్గుణ పూర్ణిమకు పూర్తిఅయ్యేటట్లుగా 5 రోజులపాటు తెప్పోత్సవాలు జరగడం ఆనవాయితి.

ప్రస్తుతం 5 రోజులపాటు జరిగే ఈతెప్పోత్సవాలలో మొదటి రోజు పాల్గుణ శుద్ద ఏకాదశిన శ్రీసీతారామ లక్ష్మణులు, రెండవ రోజు ద్వాదశిన రుక్మిణీ శ్రీకృష్ణులు పాల్గొంటారు. ఇక మూడవ రోజు త్రయోదశి నుండి పున్నమి వరకు మూడు రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలను అందుకొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.