PUNGANUR SRI KALYANA VENKATESWARA SWAMY BRAHMOTSAVAMS FROM FEBRUARY 24 TO MARCH 4 _ ఫిబ్రవరి 24 నుండి మార్చి 4 వరకు పుంగనూరు శ్రీ కల్యాణ వెంకటరమణస్వామివారి బ్రహ్మోత్సవాలు
Tirupati, 13 February 2026: The annual Brahmotsavams will be held from February 24 to March 04 at Sri Kalyana Venkataramana Swamy Temple in Punganur, Annamaya district.
On this occasion, the Ankurarpanam will be held on February 23 between 7 pm and 8.30 pm.
Vahana Sevas will be conducted every day during Brahmotsavam from 8 am to 11 am and again from 7 pm to 9 pm.
24.02.2026
Morning – Dhwajarohanam (9.50 am to 10.45 am in Mesha Lagnam)
Night – Peddashesa Vahanam
25.02.2026
Morning – Chinnashesa Vahanam
Night – Hamsa Vahanam
26.02.2026
Morning – Simha Vahanam
Night – Mutyapupandiri Vahanam
27.02.2026
Morning – Kalpavriksha Vahanam
Night – Hanumantha Vahanam
28.02.2026
Morning – Mohini Utsavam
Night – Garuda Vahana
01.03.2026
Morning – Suryaprabha Vahana
Night – Chandraprabha Vahana
02.03.2026
Morning – Kalyanotsavam (11 am to 1 pm)
Night – Gaja Vahana
03.03.2026
On the occasion of lunar eclipse, the temple will be closed from 09.00 am to 07.00 pm
Aswa Vahanam from 8.30 pm onwards
04.03.2026
Morning – Rathotsavam (9 am to 9 pm)
Afternoon – 12.45 pm to 2pm Chakra Snanam
Night – Dhwaja Avarohanam
05.03.2026
Tiruppavada Seva will be held at 10 am and the Sayanotsavam at 7.30 pm.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఫిబ్రవరి 24 నుండి మార్చి 4 వరకు పుంగనూరు శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2026, ఫిబ్రవరి 13: అన్నమయ్య జిల్లా పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 04వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 7 గం.ల నుండి 8.30 గం.ల మధ్య అంకురార్పణ నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టారు. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 8 నుండి 11 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
24.02.2026
ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 9.50 గం.ల నుండి 10.45 గం.ల వరకు మేష లగ్నంలో)
రాత్రి – పెద్దశేషవాహనం
25.02.2026
ఉదయం – చిన్నశేషవాహనం
రాత్రి – హంస వాహనం
26.02.2026
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
27.02.2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – హనుమంత వాహనం
28.02.2026
ఉదయం – మోహినీ ఉత్సవం
రాత్రి – గరుడ వాహనం
01.03.2026
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభవాహనం
02.03.2026
ఉదయం – కల్యాణోత్సవం (ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు)
రాత్రి – గజ వాహనం
03.03.2026
చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 09.00 గం.ల నుండి రాత్రి 07.00 గం.ల వరకు ఆలయం మూత,
రాత్రి 8.30 గం.ల నుండి అశ్వ వాహనం
04.03.2026
ఉదయం – రథోత్సవం (ఉదయం 9 గం.లకు )
మధ్యాహ్నం – 12.45 గం.ల నుండి 02.00 గం.ల వరకు మిధున లగ్నంలో చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం.
05.03.2026
ఉదయం 10 గంటలకు తిరుప్పావడ సేవ, రాత్రి 7.30 గంటలకు శయనోత్సవం జరుగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


