KSHETRAPALAKA RUDRA PUJA ON FEB 26 _ ఫిబ్ర‌వ‌రి 26న తిరుమలలో క్షేత్రపాలకుడికి అభిషేకం

TIRUMALA, 24 FEBRUARY 2025: On the auspicious occasion of Maha Sivaratri on February 26, the Kshetrapalaka Rudra near Gogarbham dam will be offered special puja.

On Wednesday at around 3pm, the temple priests and officials will carryout the special puja, offer Abhishekam and later distribute Naivedyam to the devotees.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 26న తిరుమలలో క్షేత్రపాలకుడికి అభిషేకం

తిరుమల, 2025 ఫిబ్రవరి 24: తిరుమలలోని గోగర్భం సమీపంలో వెల‌సిన‌ రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన ఘ‌నంగా అభిషేకం నిర్వ‌హిస్తారు. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్క‌డ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సుగంధ‌ ద్రవ్యాలతో క్షేత్ర‌పాల‌కునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంత‌రం భ‌క్తుల‌కు ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.