KT READIES FOR BIG DAY _ ఫిబ్రవరి 26న శ్రీ కపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినం
SERIES OF EVENTS AT VARIOUS TTD-RUN SIVA TEMPLES
TIRUPATI, 24 FEBRUARY 2025: Following the auspicious festival of Maha Siva Ratri on February 26, the famous ancient TTD-run temple of Sri Kapileswara Swamy in Tirupati is gearing up to meet the pilgrim rush on that day.
Arrangements in KT for Maha Sivaratri
On this day, Mahanyasapurvaka Ekadasa Rudrabhishekam will be observed from 2am to 4.30am followed by Bhogiteru from 7am till 9am. Later Snapana Tirumanjanam will be observed while the visesha Nandi Vahana Seva will take place from 6pm onwards.
Sarva Darshanam to the devotees will be from 6am to 2pm and again from 4.30pm till midnight. Again on February 27, Lingodbhava Kala Abhishekam will be held from 12am till 4am. On the same day evening, Siva Parvati Kalyanam will be observed from 6pm till 7.30pm.
Other temples:
Besides, other temples under the purview of TTD including Bugga, Sri Seshachala Lingeswara Swamy temple at Kandulavari Palle, Sri Brihadeswaralayam at Alipiri are also gearing up to observe the big fete.
At Kandulavaripalle, the Mahasivaratri Utsavams will be observed from February 25-27 for three days.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరి 26న శ్రీ కపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 24: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజామున 2 గంటల నుండి 4.30 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపడతారు. సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి.
ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఫిబ్రవరి 27వ తేదీ గురువారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో భక్తిసంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 27న శివపార్వతుల కల్యాణం
శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన గురువారం సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు శివపార్వతుల కల్యాణమహోత్సవం వైభవంగా జరుగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.