RATHOTSAVAM ON FEB 25 AND CHAKRASNANAM ON FEB 26 _ ఫిబ్ర‌వ‌రి 26న శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి చక్రస్నానం

TIRUPATI, 24 FEBRUARY 2025: The annual brahmotsavams at Srinivasa Mangapuram will observe Rathotsavam on February 25 and Chakrasananam coupled with Dhwajavarohanam marking the conclusion of annual fete on February 26.

The Navahnika salakatla brahmotavams commenced in Sri Kalyana Venkateswara Swamy temple on February 18 and after series of religious events the festival will culminate on Wednesday evening.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 26న శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి చక్రస్నానం

తిరుప‌తి, 2025 ఫిబ్ర‌వ‌రి 24: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన బుధ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది.

ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ప‌ల్ల‌కీ ఉత్స‌వం, ఉద‌యం 9 నుండి 10 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉద‌యం 10 నుండి 10.20 గంటల మ‌ధ్య‌ ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.

సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు తిరుచ్చి ఉత్స‌వం, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగియ‌నున్నాయి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.