ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీ వరకు వ్యాస భాగవతంపై సదస్సు

ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీ వరకు వ్యాస భాగవతంపై సదస్సు

 

తిరుపతి, ఫిబ్రవరి 25, 2013: తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో వ్యాస భాగవతంపై సదస్సు నిర్వహించనున్నారు.

 

ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసే ప్రముఖ పండితులు ఉపన్యసిస్తారు. వ్యాసుడు రచించిన సంస్కృత భాగవతం సమగ్రంగా 14 సంపుటాలలో ప్రచురణ పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పురాణాలను తెలుగులోకి అనువదించిన పది మంది పండితులను ఘనంగా సత్కరించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.