TTD EMPLOYEES ANNUAL SPORTS FROM FEBRUARY 28 _ ఫిబ్రవరి 28న టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం – టిటిడి
Tirupati, 27 February 2025: The Annual Sports for TTD employees will commence on February 28 with an inaugural ceremony scheduled in TTD Parade Grounds on Friday at 10:30am and will continue till March 17.
In the opening program on the first day, the names of the employees who are willing to participate can register and the competition schedule and other details will be announced.
Competitions are conducted separately for men and women, for specially abled, senior officers and retired employees.
The competition includes Tug of War, Chess, Volleyball, Carroms, Ball badminton, Football, Table Tennis, Cricket, Tennis and other sports.
Besides the Parade Grounds, sports competitions will also be organized at the Recreation Hall, Srinivasam Sports Complex, SV Arts College Grounds, SV Junior College, SV High School Grounds, SV University, SV Agriculture, Veterinary University Grounds.
TTD Welfare Department Deputy EO Sri Ananda Raju and his office staff are overseeing the Sports arrangements.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరి 28న టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం – టిటిడి
టిటిడి పరిపాలనా భవనం మైదానంలో ప్రారంభం
తిరుపతి, 2025, ఫిబ్రవరి 27: టిటిడి ఉద్యోగుల వార్షిక ఆటల పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 28 శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో క్రీడల ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పోటీలు మార్చి 17 తేదీ వరకు జరుగనున్నాయి.
మొదటి రోజు ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్ తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుంది. పురుషులకు, మహిళలకు వేరువేరుగా, ప్రత్యేక ప్రతిభావంతులకు, సీనియర్ అధికారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పోటీలను నిర్వహిస్తారు. ఇందులో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర క్రీడలు ఉన్నాయి. పరేడ్ మైదానంతో పాటు రిక్రియేషన్ హాల్, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ మైదానం, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్వీ హైస్కూల్ మైదానం, ఎస్వీ యూనివర్శిటీ, ఎస్వీ అగ్రికల్చర్, వెటనరీ యూనివర్శిటీ మైదానంలో ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు. టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ శ్రీ. ఏ. ఆనంద రాజు క్రీడల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.