KUPCHANDRAPETA UTSAVAM ON FEB 6 _ ఫిబ్రవరి 6న కూపుచంద్రపేట ఉత్సవం
TIRUPATI, 04 FEBRUARY 2023: The traditional Kupchandrapeta utsavam will be held on February 6 where in the utsava deities of Sri Kodanda Ramaswamy along with Sri Sita, Lakshmana Swamy will be rendered snapanam.
This village is located about 8km from Tirupati. It is an age old practice to observe the special abhishekam to the deities in this village on the auspicious day of Magha Pournami.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఫిబ్రవరి 6న కూపుచంద్రపేట ఉత్సవం
తిరుపతి, 04 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 6వ తేదీన కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.
శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 5 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఊంజల్ సేవ, సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవం నిర్వహించి, తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.