ANKURARPANA FOR SRI KAPILESWARA SWAMY TEMPLE BRAHMOTSAVAM ON FEBRUARY 07 _ ఫిబ్ర‌వ‌రి 7న శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

– DHWAJAROHANAM ON FEBRUARY 08

Tirupati, 05 February 2026: The Ankurarpana for the annual Brahmotsavams of Sri Kapileswara Swamy temple in Tirupati will be performed in a traditional manner on February 07. 

The Brahmotsavams will be conducted at the temple from February 08 to March 17.

Dhwajarohanam on February 08

The Brahmotsavams will formally commence with Dhwajarohanam on February 08 at 6.05 a.m. in Makara Lagnam. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 7 శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ఫిబ్రవరి 8 ధ్వజారోహణం

తిరుపతి, 2026 ఫిబ్రవరి 05: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఫిబ్ర‌వ‌రి 7న‌ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 8 నుండి మార్చి 17వ తేదీ వరకు ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయి.

అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వ‌నున్నారు. ఆ త‌రువాత సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వ‌హిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 8 ధ్వజారోహణం :

ఫిబ్ర‌వ‌రి 8న ఉదయం 6.05 గంటలకు మ‌క‌ర‌ లగ్నంలో ధ్వజారోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.

ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు పురవీధుల్లో వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

టిటిడి ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.