FESTIVALS AT SRI KRT IN FEBRUARY _ ఫిబ్రవరిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati,30 January 2021: All festivals in the month of February at Sri Kodandarama Swamy temple will be held in Ekantham in view of Covid guidelines.
Following are the details:
February 6,13,20,27: All Saturdays Abhisekam to Mulavarulu of Sri Sita, Rama and Lakshmana at 6am
February 11: Sahasra Kalashabhisekam on Amavasya day
February 24: On Punarvasu Nakshatram Sri Sitarama Kalyanam in the morning and the Unjal seva in the evening.
February 27: Ashtottara Sata Kalasabhishekam in the morning on Pournami day.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2021 జనవరి 30: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. కోవిడ్ – 19 నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
– ఫిబ్రవరి 6, 13, 20, 27వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు.
– ఫిబ్రవరి 11వ తేదీ అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది.
– ఫిబ్రవరి 24న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ జరుగనుంది.
– ఫిబ్రవరి 27న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.