SRI NARASIMHA MAHA YAGAM AT AHOBILAM FROM FEB 1-3 _ ఫిబ్ర‌వ‌రి 1 నుండి 3వ తేదీ వ‌ర‌కు అహోబిల క్షేత్రంలో శ్రీ న‌ర‌సింహ మ‌హాయాగం

Tirupati, 31 January 2020: The  Dasa Sahitya Project of TTD is organising  a three day Sri Narasimha Maha Yagam from February 1-3 at the well known Narasimha kshetram of Ahobilam in Kurnool district of Andhra Pradesh.

The event aimed at world peace and to end other social disorders of human race says the Special Officer of Dasa Sahitya Project,Sri Anandathirthacharyulu.

He said Maha yagam would  be conducted from 8am to 12.30pm during which Manya sukti, Narasimha sukti Parayanam will be performed. Nearly 300 member bhajan mandal will present bhajans of Narasimha sankeertans and other dharmic discourses on the occasion.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రి 1 నుండి 3వ తేదీ వ‌ర‌కు అహోబిల క్షేత్రంలో శ్రీ న‌ర‌సింహ మ‌హాయాగం

జనవరి 31, తిరుపతి 2020: ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన అహోబిల క్షేత్రంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఫిబ్ర‌వ‌రి 1 నుండి 3వ తేదీ వ‌ర‌కు శ్రీ న‌ర‌సింహ మ‌హాయాగం జ‌రుగ‌నుంది. ప్ర‌పంచ‌శాంతి కోసం, మాన‌వులకు భ‌యం, ఈతిబాధ‌లు తొల‌గించాల‌ని శ్రీ న‌ర‌సింహ‌స్వామివారిని ప్రార్థిస్తూ ఈ యాగం నిర్వ‌హిస్తామ‌ని దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు తెలిపారు.

ఈ మూడు రోజుల పాటు ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు యాగం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా మ‌న్య‌సూక్త పారాయ‌ణం, న‌ర‌సింహ స్తుతి పారాయ‌ణం చేస్తారు. సాయంత్రం భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు న‌ర‌సింహ కీర్త‌న‌లతో భ‌జ‌న‌లు, ధార్మిక ప్ర‌వ‌చ‌నాలు నిర్వ‌హిస్తారు. ఈ యాగంలో 300 మంది భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.