ANKURARPANA IN SKVST ON FEB 19 _ ఫిబ్రవరి 19న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
TIRUPATI, 18 FEBRUARY 2022: Ankurarpana for annual Brahmotsavams in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram will be held on February 19.
This ritual of prelude will be observed on Saturday between 6pm and 8pm. Series of religious events like Mritsangrahanam, Senadhipati Utsavam followed by Ankurarpana or Beejavapanam will be performed.
The nine day fete will flag off with Dhwajarohanam on February 20 in the auspicious Meena Lagnam between 9am and 9:20am.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 19న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2022 ఫిబ్రవరి 18: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరుగనుంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయంలో ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయి.
ఈ సందర్భంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 20న ధ్వజారోహణం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం ఉదయం 9 నుండి 9.20 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. అంతకుముందు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనుంది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.