ఫిబ్ర‌వ‌రి 24న నెల్లూరు, 27న చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు

ఫిబ్ర‌వ‌రి 24న నెల్లూరు, 27న చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2021 ఫిబ్ర‌వ‌రి 20: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 24న నెల్లూరు జిల్లా, ఫిబ్ర‌వ‌రి 27న చిత్తూరు  జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

ఫిబ్రవ‌రి 24వ తేదీన నెల్లూరు జిల్లా దొర‌వారి స‌త్రం మండలం కొత్త‌వారి ప‌ల్లి గ్రామంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌నివాస కల్యాణం జరగనుంది.

ఫిబ్రవ‌రి 27వ తేదీన చిత్తూరు కార్పొరేష‌న్‌ మాపా‌క్షి ప్రాంతంలో శ్రీ ఆభ‌య ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌వారి కల్యాణం జరుగనుంది.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు చేయ‌నున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.