MORE FACILITIES TO PILGRIMS WITH FEEDBACK SYSTEM -ADDITIONAL EO _ ఫీడ్బ్యాక్ సిస్టంతో భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే మా ధ్యేయం : గణతంత్ర వేడుకల్లో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి
Tirumala, 26 January 2025: Providing more pilgrim-friendly initiatives and improving the facilities of darshan, accommodation, Annaprasadam and prasadams by through Feedback System is top priority of TTD said, the Additional EO Sri Ch Venkaiah Chowdary.
The Additional EO who participated in the 76th Republic Day celebrations hoisted the national flag at Gokulam Rest House premises in Tirumala on Sunday morning.
Speaking on the occasion he called upon the employees to work together and provide better services to the devotees who come from all over the world to have a darshan of Srivaru.
Adding further he said over 96% of devotees have expressed their immense satisfaction over the arrangements by TTD during 10-day Vaikuntha Dwara Darshanam in Tirumala.
He said the data was gathered by collecting feedback from the devotees on the various arrangements implemented by TTD with the help of Srivari Sevaks. The goal is to provide the devotees with more convenient darshan and other facilities in a transparent manner by improving amenities from time to time through feedback system.
Later he said, the annual Brahmotsavam in October last was a great success with the teamwork.
He said that changes have been made in Annaprasadam and queue lines for the convenience of devotees. ”We are setting up state-of-the-art machines to provide more quality food to the devotees”, he maintained.
The Additional EO said that over 6.83 lakh devotees visited Vaikunta Dwaram from January 10 to 19 which was a quite good number than previous years.
He said the problems in the allotment of accommodation in Tirumala will be resolved and the repairs in some cottages will be completed soon and cottages will be made available to the devotees.
He also said that steps will be taken to strengthen the IT department of TTD and provide hassle free and more transparent services to the devotees.
He said that the e-hundi system introduced by TTD recently is giving good results. The devotees are making donations easily through UPI in the Kiosks set up at many places in Tirumala.
Concluding his speech the Additional EO said whenever there is an emergency situation due to heavy pilgrim influx, TTD is contemplating means on how to handle such issues and take all care that such incidents will not be repeated in future.
To achieve the goal of providing hassle-free services to devotees, a proper team work by all departments is a must and appreciate the commitment of the strong workforce of TTD.
CE Sri Satyanarayana, VGOs Sri Ramkumar, Sri Surendra, other HoDs were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫీడ్బ్యాక్ సిస్టంతో భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే మా ధ్యేయం :
టీటీడీ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై 96% భక్తుల సంతృప్తి
– గణతంత్ర వేడుకల్లో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి
తిరుమల, 2025 జనవరి 26: భక్తులనుండి టిటిడి అమలు చేస్తున్న వివిధ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ సిస్టం ద్వారా శ్రీవారి సేవకుల సహాయంతో అభిప్రాయ సేకరణ చేస్తూ వారికి మరింత సౌకర్యవంతమైన దర్శనం, ఇతర వసతులు పారదర్శకంగా కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు.
తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో ఆదివారం ఉదయం 76వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, పంద్రాగస్టు తరువాత భారత రాజ్యాంగం రూపొందించబడిన ప్రత్యేకమైన రోజుకు గుర్తుగా గణతంత్ర దినోత్సవం ప్రతి ఏటా గంగా మనం నిర్వహించుకుంటున్నాం అని అన్నారు.
ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ ఉద్యోగులు సమిష్టి కృషితో పని చేసి మరింత మెరుగైన సేవలందించాలని పిలుపునిచ్చారు.
గత ఏడాది అక్టోబరులో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించామన్నారు.
భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదాలు, క్యూలైన్ల నిర్వహణ మార్పులు చేశామన్నారు. భక్తులకు మరింత నాణ్యమైన అన్నప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 6.80 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాము ఫీడ్ బ్యాక్ సిస్టమ్ ద్వారా భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాల్లో దాదాపు 96 శాతం మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలపడం జరిగిందన్నారు.
తిరుమలలో వసతి గదుల కేటాయింపులో ఉన్న సమస్యలు పరిష్కరించి, మరి కొన్ని కాటేజిలో మరమ్మతులు త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. తిరుమలలో అన్నదానం, పారిశుద్ధ్యం, విద్యుత్ శాఖ, ఉద్యానవన శాఖ వంటి విభాగాలు బాగా పని చేస్తున్నాయని, సమిష్టి కృషితో అన్ని విభాగాలలో వంద శాతం మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
టీటీడీ ఐటి విభాగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకొని భక్తులకు సులభతరంగా సేవలు అందిస్తామన్నారు.
టీటీడీ ఇటీవల ప్రవేశపెట్టిన ఈ హుండీ విధానం మంచి ఫలితాలు ఇస్తున్నదన్నారు.
తిరుమలలో పలుచోట్ల ఏర్పాటు చేసిన కియోస్క్ లలో యుపిఐ ద్వారా భక్తులు సులభతరంగా విరాళాలు అందిస్తున్నారని చెప్పారు.
అనునిత్యం తిరుమలకు విచ్చేసే కోట్లాదిమంది భక్తులకు కొన్ని సమయాల్లో అందిస్తున్న సౌకర్యాలలో చిన్నపాటి సమస్యలు వస్తుంటాయన్నారు. అట్లాంటి వాటిని కూడా అధిగమించి భక్తులకు సౌకర్యవంతమైన సేవలు కల్పించడంలో టీటీడీ అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ సత్యనారాయణ, విజివోలు శ్రీ రాంకుమార్, శ్రీ సురేంద్ర అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.