‘బర్డ్‌’లో మెరుగైన వైద్యం అందించాలి : తితిదే ఛైర్మన్‌

‘బర్డ్‌’లో మెరుగైన వైద్యం అందించాలి : తితిదే ఛైర్మన్‌

తిరుపతి, జూన్‌ 10, 2013: తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు వైద్యులకు సూచించారు. సోమవారం ఉదయం ఆయన బర్డ్‌ ఆసుపత్రిని సందర్శించారు. పలు వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి వాకబు చేశారు.
రోగులకు మెరుగైన సేవలు అందించినందుకు గాను బర్డ్‌ సంచాలకులు డాక్టర్‌ జగదీష్‌కు అమెరికాలోని తెలుగు సంఘం తానా మే నెల చివరి వారంలో ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించడంపై శ్రీ బాపిరాజు ఆయన్ను అభినందించారు. అంతకుముందు ఆస్పత్రి కార్యాలయానికి వెళ్లి  సిబ్బందిని పలకరించారు. ఉత్తమ సేవలందిస్తున్న వైద్యులను, సిబ్బందిని అభినందించారు. మరింత అంకితభావంతో పనిచేసి రోగుల మన్ననలు అందుకోవాలని ఆయన సూచించారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.