EMINENT SPECIALISTS TO PROVIDE FREE SERVICES AT BIRRD HOSPITAL _ బర్డ్ ఆసుపత్రికి ప్రముఖ వైద్య నిపుణుల రాక ఉచితంగా ఓపి సేవలు
Tirupati, 3 Nov. 20: Eminent Orthopaedic specialists will be available at BIRRD hospital (Balaji Institute of Surgery Research and Rehabilitation for the Disabled) on November 5 and 6 to provide free OP Consultations to needy patients.
The BIRRD director Dr Madanmohan Reddy said on Tuesday that Eminent orthopaedic surgeon from Bangalore Dr Hemant will provide service on Thursday morning 08am to 10 am
Similarly, on Friday prominent spinal-chord and brain specialist Dr Balamurugan from Apollo hospital will provide free OP service from 08-10 am.
He appealed to interested patients to call on 9840201902 for appointments and take advantage of their free services.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
బర్డ్ ఆసుపత్రికి ప్రముఖ వైద్య నిపుణుల రాక
ఉచితంగా ఓపి సేవలు
తిరుపతి, 03 నవంబరు 2020: బర్డ్ ఆసుపత్రిలో ఈ నెల 5, 6 తేదీల్లో ప్రముఖ వైద్య నిపుణులు ఉచితంగా ఓపి సేవలు అందిస్తారని డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వతేదీ గురువారం బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ హేమంత్ ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఓపి సేవలు అందిస్తారని తెలిపారు. 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చెన్నై అపోలో ఆసుపత్రికి చెందిన మెదడు, వెన్నెముక సర్జన్ డాక్టర్ బాలమురుగన్ ఉచితంగా ఓపి సేవలు అందిస్తారని డైరెక్టర్ చెప్పారు. డాక్టర్ల అపాయింట్ మెంట్ కోసం 9840201902 ను సంప్రదించాలని ఆయన కోరారు. రోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.