FIRST OF IT’S KIND KNEE REPLACEMENT OPERATION AT BIRRD – Dr MADANMOHAN REDDY _ బర్డ్ లో తొలిసారి అరుదైన మోకీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స. – నొప్పి లేని, ఫిజియో థెరఫీ అవసరం లేని చికిత్స బర్ద్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి

Tirupati, 20 Nov. 20: Unique knee replacement operation, first of its kind, has been carried out in BIRRD ortho hospital said Honourary Director Dr Madanmohan Reddy.

Successfully carried out on a 48-year-old patient Sujata Kurnool who had a twisted knees and unable to walk. Disclosing the operation details to media in the Hospital on Friday along with his team comprising of Dr Girija, Dr Naveen and Dr Chaitanya, he said the woman was suffering from severe knee pains from the last three years. On June 6 we did right knee operation and on October 30 the left which lasted for nearly four hours each and now she could able to walk without any pain, he added.

The BIRRD Chief appreciated the work of his team of doctors who successfully executed the advanced Pain Management technique to carry out the operation on the lady without loss of much blood in an innovative manner.

Smt Sujata also thanked the team of doctors terming them as her Life Saviours and Real Gods. I never thought I will walk again and lead a normal life. It’s like a rebirth to me and I whole-heatedly thank all the doctors for the same, she reiterated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

బర్డ్ లో తొలిసారి అరుదైన మోకీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స. – నొప్పి లేని, ఫిజియో థెరఫీ అవసరం లేని చికిత్స బర్ద్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి

తిరుపతి, 20 నవంబరు 2020: రెండు మోకీళ్ళు వంకర పోయి నడవడమే కష్టంగా ఉన్న ఒక మహిళకు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని బర్ద్ ఆసుపత్రి గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ ఆపరేషన్లలో తనతో పాటు పని చేసిన డాక్టర్లు చైతన్య, నవీన్, గిరిజ తో కలసి శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 48 సంవత్సరాల సుజాతకు చిన్నప్పటి నుంచి రెండు కాళ్ళు సొట్టపోయి ( వాల్గస్ డిఫర్మిటి) నడవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చారని డాక్టర్ మదన్ మోహన్ చెప్పారు. మూడేళ్ళుగా ఆమె విపరీతమైన మోకీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారని చెప్పారు. తెలిసిన వారి ద్వారా ఆమె తనను సంప్రదించారన్నారు. తన తోటి డాక్టర్ల తో చర్చించి అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. జూన్ 6 వతేదీ కుడి మోకీలు ఆపరేషన్, అక్టోబర్ 30వ తేదీ ఎడమ మోకీలు ఆపరేషన్ చేశామని ఆయన తెలిపారు. నాలుగు గంటల పాటు శ్రమించి చేసిన ఈ ఆపరేషన్లు విజయవంతమై, ఆమె రెండు కాళ్ళు చక్కగా వచ్చి బాగా నడవగలుగుతోందని వివరించారు.

ఫాస్ట్ ట్రాక్ మోకీళ్ల మార్పిడి:

సుజాతకు నూతన పద్ధతిలో బర్ద్ చరిత్రలో తొలిసారి నొప్పిలేని, రక్తం భారీగా నష్టపోని రీతిలో ఆపరేషన్ చేశామని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఆపరేషన్ కు అవసరమైన పరీక్షలు, ఎక్సరే లన్నీ ఓపి పేషంట్ గానే పూర్తి చేశామన్నారు. ఆపరేషన్ కు ఒక రోజు ముందు అడ్మిట్ చేసుకుని, మరుసటి రోజు ఉదయం ఆపరేషన్ చేసి సాయంత్రానికి ఆమెను నడిపించామన్నారు. సాధారణంగా ఇలాంటి ఆపరేషన్ చేసినపుడు పేషంట్ కు విపరీతమైన నొప్పి ఉంటుందనీ, తాము నూతన మెలకువలతో చేసిన పెయిన్ మ్యానేజ్మెంట్ విధానం వల్ల సుజాతకు నొప్పే లేకుండా చేయగలిగామన్నారు. 10 రోజుల తరువాత కుట్లు విప్పదీసి ఆమె సాధారణంగా నడిచేలా చేయగలిగామని ఆయన చెప్పారు. ఈ ఆపరేషన్ తరువాత ఫిజియో థెరఫీ అవసరం లేదన్నారు. ఈ హెచ్ ఎస్ పథకం కింద ఈ ఆపరేషన్ నగదు రహితంగా నిర్వహించినట్లు ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో కూడా బర్ద్ లో 270 కి పైగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు వివరించారు.

నేను బతుకుతానని అనుకోలేదు :

మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న సుజాత మాట్లాడుతూ పసితనంలో కామెర్లు వస్తే తన అమ్మ, నాన్న కాళ్లకు వాతలు వేయించడంతో కాళ్ళు సొట్టపెట్టి నడిచానన్నారు. క్రమంగా తన కాళ్ళు పూర్తి సొట్టగా మారిపోయాయని చెప్పారు. మూడేళ్ళుగా విపరీతమైన నొప్పి వచ్చి తాను బతుకుతానని అనుకోలేదని చెప్పారు. బర్ద్ లో డాక్టర్లు తనకు మళ్లీ ప్రాణం పోశారనీ, ఇప్పుడు తాను అందరిలాగే నడవగలుగుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు.తనకు ఆపరేషన్లు చేసిన డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి తో పాటు ఇతర డాక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటానని సుజాత తెలిపారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది