ELEVENTH EDITION OF BALAKANDA AKHANDA PARAYANAM HELD _ బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన తిరుమ‌ల‌గిరులు

TIRUMALA, 25 AUGUST 2022:  The Eleventh Edition of Akhanda Balakanda Parayanam was held at Nada Neerajanam Platform in Tirumala on Thursday between 7am and 9am which was telecasted live on SVBC for the sake of global devotees of Sri Venkateswara Swamy.

 

Led by versatile Sanskrit scholar and National Sanskrit University Professor Prava Ramakrishna Somayajulu, 153 shlokas from chapters 50 to 55 were recited by the Vedic scholars and devotees.

 

Speaking on the occasion, the Sri Somayajulu said, Ramayana Parayanam is the best medicine for all ailments. “If we recite the Shlokas of Ramayanam, the entire humanity will be free from all diseases, and difficulties and shall lead a happy life”, he asserted.

 

The Hill Town reverberated to the rhythmic vibrations of the Shlokas recited by the pundits and devotees.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన తిరుమ‌ల‌గిరులు

తిరుమల, 2022 ఆగ‌స్టు 25: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురువారం ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు 11వ‌ విడ‌త బాల‌కాండ అఖండ పారాయ‌ణం భక్తజనరంజకంగా సాగింది. బాలకాండలోని 50 నుండి 55 సర్గల వ‌ర‌కు గ‌ల 153 శ్లోకాలను వేద పండితుల అఖండ పారాయ‌ణంతో తిరుమ‌ల గిరులు మార్మోగాయి.

బాల‌కాండ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆధ్యాప‌కులు ఆచార్య ప్ర‌వా రామ‌కృష్ణ సోమ‌యాజులు మాట్లాడుతూ ‌మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన మంత్రోచ్చార‌ణ దివ్యశ‌క్తిని కలిగిస్తుందని, దీనితో స‌మ‌స్త రోగాల‌ను న‌యం చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. అనాదికాలం నుండి మాన‌వులు రామాయ‌ణం విని, పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న బాధ‌లు తొల‌గి, సుఖ సంతోషాల‌తో ఉన్న‌ట్లు పురాణాల ద్వారా నిరూపిత‌మైన‌ద‌న్నారు. వాల్మీకి మ‌హ‌ర్షి శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిని ఆశ్ర‌యించిన‌ట్లు, యావ‌త్ ప్ర‌పంచం రాముని ఆశ్రయించి, రామనామం పలికితే స‌క‌ల శుభాలు సిద్ధిస్తాయ‌ని వివ‌రించారు.

అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రియ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన పండితులు పాల్గొన్నా‌రు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.