బాలుని మరణానికి సంబంధించిన అవాస్తవ వార్తలపై పై టీటీడీ ఖండన

బాలుని మరణానికి సంబంధించిన అవాస్తవ వార్తలపై పై టీటీడీ ఖండన

తిరుమల, 2025 ఫిబ్రవరి 25: ఈనెల 22వ తారీఖున కర్ణాటక రాష్ట్రం మడికెరకు చెందిన మంజునాథ అనే బాలుడు తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సాయంత్రం భోజనం తర్వాత బయటకు వస్తూ అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగింది.

వెనువెంటనే అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి ఆ బాలుని తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్చడం జరిగింది.

తదనంతరం వైద్యుల సలహా మేరకు తిరుపతిలోని స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆ బాలుని చేర్చడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆ బాలుడు ఈ రోజు మరణించడం జరిగింది.

వాస్తవానికి ఆ బాలుడు దీర్ఘకాలంగా గుండె జబ్బుతో బాధపడుతూ ఆరు సంవత్సరాల మునుపే గుండెకు చికిత్స చేసుకోవటం జరిగింది.

వాస్తవాలు ఇలా ఉండగా కొన్ని ప్రసార మాధ్యమాలలో ఆ బాలుడు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో తోపులాట కారణంగా మరణించాడు అని పేర్కొనడం వాస్తవం కాదు.

టీటీడీ పై ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురించి, అవాస్తవాలు ప్రచారం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది