LAST KARTHIKA SUNDAY UTSAVA HELD _ భక్తుని చెంతకు భగవంతుడు… వేడుకగా కార్తీక మాస కడపటి ఆదివార ఉత్సవం
Tirupati, 13 Dec. 20: The festival of last Sunday in Karthika month was observed at Sri Govindaraja Swamy temple in Tirupati.
As part of the festivities, the utsava idols of Sri Govindaraja Swamy and his consorts were paraded in Bangaru Tiruchi and later offered Snapana Tirumanjanam at Sri Anjaneya temple, which was followed by nivedana, and Asthana.
Thereafter the idols of Sri Govindaraja Swamy and Sri Anjaneya Swamy were brought in two separate Tiruchis to the Sri Govindarajaswami temple.
Temple special grade DyEO Sri Rajendrudu, Chief archaka Sri Srinivasa Dikshitulu, Superintendent Sri Rajendra Kumar, Temple Inspector Sri Krishnamurthy and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
భక్తుని చెంతకు భగవంతుడు
వేడుకగా కార్తీక మాస కడపటి ఆదివార ఉత్సవం
ఆంజనేయస్వామి సన్నిధికి వేంచేసిన శ్రీ గోవిందరాజ స్వామివారు
తిరుపతి, 2020 డిసెంబరు 13: శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం కార్తీక మాస కడపటి ఆదివారం ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామి వారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి సన్నిధి వీధిగుండా ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఎదురు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు, శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణ చేసి నివేదన, ఆస్థానం నిర్వహించారు. తదుపరి స్వామి అమ్మవార్లను ఒక తిరుచ్చి మీద, శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఇంకొక తిరుచ్చి మీద వేంచేపు చేసి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆంజనేయ స్వామి వారు విమాన ప్రదక్షిణగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో మూలవర్లకు పూలంగి సేవ, అధిక సంఖ్యలో దీపాలను వెలిగించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటి ఈఓ శ్రీ రాజేంద్రుడు, ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.