TTD CALENDARS AND DIARIES 2024 AVAILABLE FOR SALES _ భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు
TIRUMALA, 28 OCTOBER 2023: The year 2024 Calendars and Diaries published by TTD are available for purchase at all TTD Book Stores in Tirumala and Tirupati.
Similarly, devotees can purchase 12-page calendars, diaries, table top calendars through the website ttdevasthanams.ap.gov.in
The price each mode per piece are as follows:
12 Page Calendar – Rs.130/-, Diary(Deluxe) Rs.150/-, Diary(Small) Rs.120/-, Table Top Calendar Rs.75/-, 6- Page Calendar Rs.450/-, Sri Venkateswara Swamy Big Calendar Rs.20/-, Srivaru and Sri Padmavati Ammavaru Calendar Rs.15/-, Sri Padmavati Big Calendar Rs.20/-, Telugu Panchangam Calendar Rs.30/-.
Besides Tirumala and Tirupati, TTD Calendars and Diaries are available for sales at Sri Venkateswara Swamy and Sri Padmavati Ammavaru Temples in Chennai, Srivari Temples in Hyderabad, Bangalore, Vijayawada, Vizag, Information Centers in Mumbai, New Delhi, Vellore, Kancheepuram, TTD Kalyana Mandapams in Nellore, Rajahmundry, Kakinada, Kurnool also.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు
తిరుమల, 2023 అక్టోబరు 28: టీటీడీ ముద్రించిన 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేయవచ్చు.
ధరల వివరాలు ….
12 పేజీల క్యాలెండర్ – రూ.130/-, డైరీ(డీలక్స్) రూ.150/-, డైరీ(చిన్న)రూ.120/-, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75/-, 6 పేజీల క్యాలెండర్ రూ.450/-, శ్రీ వేంకటేశ్వరస్వామి పెద్ద క్యాలెండర్ రూ.20/-, శ్రీవారు మరియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15/-, శ్రీ పద్మావతి పెద్ద క్యాలెండర్ రూ.20/-, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30/-.
బయటి ప్రాంతాల్లో…
చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.