EO EXTENDS DEEPAVALI GREETINGS _ భక్తులకు టీటీడీ ఈవో దీపావళి శుభాకాంక్షలు

Tirumala, 29 October 2024: TTD EO Sri J Syamala Rao has conveyed his greetings to Srivari devotees across the world on the occasion of the Deepavali Festival on October 31.

He wished that the blessings of Sri Venkateswara Swamy be showered on all the devotees bringing them peace, health and prosperity.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు టీటీడీ ఈవో దీపావళి శుభాకాంక్షలు

తిరుమల, 2024 అక్టోబ‌రు 29: ఈనెల 31వ తేదిన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కలియుగ ప్రత్యక్ష దైవమని శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.

చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. అందరూ ధర్మమార్గంలో నడవడం ద్వారా శ్రీవారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ ఈవో కోరారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.