TTD REVISES DARSHAN QUOTA IN VIEW OF INCREASING COVID CASES _ కోవిడ్ 19 రెండో విడత వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు : టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

ADHERE TO COVID GUIDELINES – TTD TO DEVOTEES

 Tirumala, 30 Mar. 21: As the second spell of Covid cases are reportedly spreading across the country, TTD has revised the darshan quota and also issued an important advisory to devotees in view of their health security. 

TTD has appealed to devotees coming for Srivari Darshan are requested to follow the guidelines and cooperate with the TTD in the best interests of all.

Briefing the same to media persons during a press conference held at Annamayya Bhavan in Tirumala on Tuesday evening the Additional EO Sri AV Dharma Reddy said-

Devotees should wear masks compulsorily at Vaikuntam queue complex, Srivari temple, Anna Prasadam Bhavan, Kalyana katta and at all crowded gatherings in Tirumala.

TTD has decided to reduce the Sarva Darshan tokens from present 22,000 to 15,000.

TTD is also mulling to reduce the number of online Special Darshan tickets (Rs.300) depending on the COVID-19 situation 

Thermal screening machines installed at Anna Prasadam centres, Room allocation counters etc.

Only two persons will be allotted in each room at Tirumala

All devotees coming to Tirumala should bring their own masks and sanitizers.

Devotees will be allowed at Alipiri Check Point only by 1pm for their next day darshan and those who are trekking Alipiri and Srivarimettu only at 9am for their darshan slot on the next day.

Devotees advised to utilise Sanitizers kept at the Vaikuntam complex and inside the Srivari temple.

Devotees will be allowed to enter Vaikuntham Queue Complex only half an hour before their allotted darshan timing

Devotees to observe strict social distancing in every region of Tirumala 

All vehicles will be subject to sanitization at Alipiri tollgates, Devotees to undergo thermal scanning

Devotee with fever, cold and cough are advised to not visit Tirumala

Devotees from other states especially states of Tamilnadu, Karnataka and also Maharashtra who are directly coming for darshan should take note of the reduction in Sarva Darshan tokens issued at Tirupati

TTD is reviewing its earlier decision to revive the arjita sevas from April 14 in view of the spike in Covid cases

Directions issued to all TTD department chiefs to review Covid situation and take up precautionary measures as and when needed. 

TTD Additional EO hits back on the social media campaign on tonsured hair issues.

Responding to a query, TTD Additional EO Sri AV Dharma Reddy hit back on social media campaign over the smuggling of tonsured hair issue as baseless and untrue.

He categorically stated that TTD had established a perfect system in storage, processing, handling and transport of tonsured hair of devotees and that there was no room for any misuse or pilferage or malpractices.

He said TTD responsibility ends with handing over the tonsured hair to bidders who purchased it on the e- platform.

Condemning the propaganda on social media over 120 bags of human hair which was caught at Mizoram – Myanmar border by Assam rifles, he said TTD has nothing to with that once it has sold the product to the bidder.

Adding further, the Additional EO said TTD is in touch with Assam Rifles and Mizoram police who were still probing the roots of the of hair stock smuggling and yet to pinpoint it to any location.

He said media should note that hair tonsuring is undertaken at scores of temples across India and the alleged hair bags could have come from anywhere and appealed to devotees via media not to fall prey to such false news against TTD.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

కోవిడ్ 19 రెండో విడత వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు : టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమ‌ల, 2021 మార్చి 30: తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సాయంత్రం టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

– కోవిడ్ 19 రెండవ విడత వ్యాప్తి నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా టిటిడి అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

– టిటిడి మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతోంది.

– వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణ కట్ట తో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.

– సర్వ దర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాము. భక్తులు ఈ మార్పును గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

– సర్వదర్శనం టోకెన్లు తగ్గించిన విషయాన్ని ఇతర రాష్ట్రాల భక్తులు దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాం.

– అన్న ప్రసాద కేంద్రం, గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు ఏర్పాటు చేశాము.

– అద్దె గదుల్లో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం. ఖాళీ చేసిన వెంటనే పూర్తిగా శానిటైజ్ చేస్తాం.

– తిరుమలకు వచ్చే భక్తులు తమ వెంట తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ లు తెచ్చుకోవాలని కోరుతున్నాము.

– వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయంలో టిటిడి ఏర్పాటు చేసిన శానిటైజర్ లు భక్తులు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

– తిరుమలలోని ప్రతి ప్రాంతంలో భక్తులు భౌతిక దూరం పాటించాలని కోరుతున్నాము.

– కోవిడ్ పరిస్థితులను అంచనా వేసుకుని రానున్న రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా తగ్గిస్తాం.

– అలిపిరి వద్ద ప్రతి వాహనాన్నీ శానిటైజ్ చేస్తాం. భక్తులందరికీ థర్మల్ స్కాన్ చేస్తాం.

– భక్తుల సౌకర్యార్థం జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు తిరుమలకు రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం.

– కోవిడ్ పరిస్థితులను అంచనా వేసి ఏప్రిల్ 14 నుండి ఆర్జితసేవలను ప్రారంభించే విషయాన్ని పునఃపరిశీలిస్తాం.

– తిరుమలలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించి కోవిడ్ జాగ్రత్తలపై సూచనలిచ్చాం. ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ వేయిస్తున్నాం.

తలనీలాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవం : అదనపు ఈఓ

– తలనీలాల నిల్వ, వేలం, తరలింపునకు సంబంధించి టిటిడిలో పటిష్టమైన వ్యవస్థ ఉంది. తలనీలాలు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదు.

– ఇ-వేలంలో పొందిన బిడ్డర్ కు తలనీలాలు అప్పగించడం వరకే టిటిడి బాధ్యత.

– తలనీలాల తరలింపునకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.

– ఈ విషయమై మిజోరాం పోలీసులను, అస్సాం రైఫిల్స్ పోలీసులను సంప్రదించాం. ఈ కేసు మూలలను గుర్తించేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మీడియా సమావేశంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.