SRIVARI BRAHMOTSAVAMS ARE OBSERVED WITH UTMOST PILGRIM SATISFACTION LIKE NEVER BEFORE-TTD CHAIRMAN _ భ‌క్తుల క‌ళ్ల‌లో వెలుగులు.. మ‌న‌సునిండా ఆనందం..

CO-ORDINATED TEAM EFFORTS RESULTED IN THE MASSIVE SUCCESS OF THE TWIN BRAHMOTSAVAMS 

TIRUMALA, 23 OCTOBER 2023: The twin brahmotsavams of Tirumala, Srivari Salakatla and Navaratri in the months of September and October respectively were successfully observed with utmost satisfaction of the pilgrims like never before, asserted TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy.

Addressing the media conference at Annamaiah Bhavan in Tirumala on Monday after the completion of Chakra Snanam on the last day of the Navaratri Brahmotavams along with the TTD EO Sri AV Dharma Reddy and a few other board members and officials of TTD, the Chairman described the twin brahmotsavams as a massive success and attributed the results to the coordinated efforts of TTD officials and employees with the support of Srivari Sevaks, NCC students, district administration, RTC, Police.

Adding further he said, be it Annaprasadam, Accommodation, Kalyanakatta, Laddu prasadam sales and distribution, everywhere the strong work force of TTD starting from the top most official to a sanitary worker under the able leadership of TTD EO, put extra strenuous efforts to make the twin mega religious events a humongous success by providing absolutely hassle free Mula Virat Darshan as well Vahana Darshan of Srivaru like never before giving no scope even to a petty incident. 

He said, for the first time, popular artists belonging to 15 states across the country participated in the cultural fiesta and performed their state art forms with finesse much to the admiration of the pilgrim devotees during the Vahana Sevas. Among all, the Garuda Vahana Seva stood out, with the TTD providing satisfactory darshan to each and every pilgrim not only waiting in galleries but also allowing the outside waiting pilgrims to watch the Vahana seva through special queue lines in the four corners of the Mada streets.

The TTD Board Chief also complimented the series of devotional and spiritual programmes including the religious discourses by versatile scholars and Annamacharya Sankeertans on the various platforms in Tirumala and Tirupati, release of several spiritual books before vahana sevas, the electrical illumination and floral decorations, health and medical services etc. which have excelled in their performances.

He also thanked the media for making the event a gigantic success by taking the glory of the Vahana sevas across the country with their wide publicity.

TTD Board members Sri Deshpande, Sri Venkata Subba Raju, Sri Nagasatyam, Sri Yanadaiah, Dr Tippeswami, Sri Aswartha Naik, Smt Vemireddi Prasanthi, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

  

భ‌క్తుల క‌ళ్ల‌లో వెలుగులు.. మ‌న‌సునిండా ఆనందం..

– భ‌క్తులు మ‌ధురానుభూతితో వాహ‌న‌సేవ‌ల ద‌ర్శ‌నం

– స‌మ‌న్వ‌యంతో శ్రీ‌వారి రెండు బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతం

– టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి

తిరుమల, 2023 అక్టోబ‌రు 23: శ్రీ‌వారి సాల‌క‌ట్ల‌, న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తులు మ‌ధురానుభూతితో వాహ‌న‌సేవ‌ల ద‌ర్శ‌నం చేసుకున్నార‌ని, త‌ద్వారా భ‌క్తుల క‌ళ్ల‌లో వెలుగులు, మ‌న‌సు నిండా ఆనందంతో నిండిపోయింద‌ని టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి చెప్పారు. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన సోమవారం చ‌క్ర‌స్నానం అనంత‌రం అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఛైర్మ‌న్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పాల‌క‌మండ‌లి, అధికారులు, సిబ్బంది, మీడియా ప్ర‌తినిధుల‌ గొప్ప స‌మ‌న్వ‌యంతో స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో బ్ర‌హ్మోత్స‌వాలు దిగ్విజ‌యంగా జ‌రిగాయ‌న్నారు. అదేవిధంగా, ఈ కింది వివ‌రాల‌ను ఛైర్మ‌న్ తెలియ‌జేశారు.

– ఈ సంవ‌త్స‌రం అధిక మాసం కార‌ణంగా రెండు బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించాం.

– ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల ధ్వ‌జారోహ‌ణం నాడు స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అలాగే యాత్రికులు, తిరుప‌తి ప్ర‌జ‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే శ్రీ‌నివాస సేతు, విద్యార్థుల ఉప‌యోగార్థం ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల‌లో నిర్మించిన అద‌న‌పు హాస్ట‌ల్ భ‌వ‌నాల‌ను ప్రారంభించారు.

– అదేవిధంగా, టీటీడీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇంటిస్థ‌లాల‌ను పంపిణీ చేసి వారి సొంత ఇంటి క‌లను సాకారం చేసిన ముఖ్య‌మంత్రిగారికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. మ‌రో 250 ఎక‌రాలు స‌మీక‌రించి ఉద్యోగులంద‌రికీ ఇంటిస్థ‌లాలు ఇవ్వాల‌ని ఈవోను, క‌లెక్ట‌రును ముఖ్య‌మంత్రివ‌ర్యులు ఆదేశించ‌డం ఉద్యోగుల‌కు గొప్ప బ‌హుమానం.

– ల‌క్ష‌లాది మంది సామాన్య భ‌క్తుల‌కు బ్ర‌హ్మోత్స‌వాల్లో సంతృప్తిక‌రంగా స్వామివారి వాహ‌న‌సేవల ద‌ర్శ‌నం చేయించాం.

– ముఖ్యంగా సామాన్య భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా వ‌స‌తి, అన్న‌ప్ర‌సాదం, త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ‌, ల‌డ్డూప్ర‌సాదాలు అందించాం.

– వాహ‌న‌సేవ‌ల ముందు మునుపెన్న‌డూ లేనివిధంగా క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు గొప్ప ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. దేశ‌వ్యాప్తంగా 15 రాష్ట్రాల నుండి అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన క‌ళారూపాలు, జాన‌ప‌ద నృత్యాలను ప్ర‌ద‌ర్శించిన‌ క‌ళాకారులు భ‌క్తుల అభినంద‌న‌లు అందుకున్నారు.

– పెరుగుతున్న సాంకేతిక‌త‌ను వినియోగించుకుని ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో ఏర్పాటుచేసిన పుష్పాలంక‌ర‌ణ‌లు, విద్యుద్దీపాలంక‌ర‌ణ‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

– క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద అనంత‌ప‌ద్మ‌నాభ‌స్వామివారి సెట్టింగుతోపాటు వివిధ విభాగాల ద్వారా ఏర్పాటుచేసిన ఎగ్జిబిష‌న్లు భ‌క్తుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి.

– తిరుమ‌ల నాద‌నీరాజ‌నం, ఆస్థాన‌మండ‌పం వేదికల‌ మీద ప్ర‌ముఖ క‌ళాకారులు ఆల‌పించిన అన్న‌మ‌య్య, పురంద‌ర‌దాస‌ సంకీర్త‌న‌లు, ధార్మికోప‌న్యాసాలు భ‌క్త‌జ‌నాన్ని ఆధ్యాత్మికానందంలో ఓల‌లాడించాయి.

– అలాగే, తిరుప‌తిలోని మ‌హ‌తి ఆడిటోరియం, అన్న‌మాచార్య క‌ళామందిరం, రామ‌చంద్ర పుష్క‌రిణిలో ఏర్పాటుచేసిన సంగీత‌, నృత్య కార్య‌క్ర‌మాలు తిరుప‌తివాసుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

– వాహ‌న‌సేవ‌ల ముందు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాష‌ల్లో ముద్రించిన ఆధ్యాత్మిక పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించాము.

– ఎస్వీబీసీలోని నాలుగు భాష‌ల ఛాన‌ళ్ల‌లో వాహ‌న‌సేవ‌ల‌తోపాటు ఇత‌ర ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌తిరోజూ సుమారు 9 గంట‌ల పాటు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశాం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు బ్ర‌హ్మోత్స‌వాల ప్ర‌సారాల‌ను తిల‌కించారు. త‌ద్వారా ఛాన‌ల్ అత్య‌ధిక రేటింగ్‌ను అందుకుంది.

– ఎక్కువ మంది భ‌క్తులకు ద‌ర్శ‌నం కల్పించేందుకు వీలుగా ఆగ‌మ పండితుల అనుమ‌తితో తొలిసారిగా గ‌రుడ‌సేవ‌ను సాయంత్రం 6.30 గంట‌ల‌కే ప్రారంభించాం.

– గ‌రుడ‌సేవ నాడు గ్యాల‌రీల్లోకి రాలేని భ‌క్తుల సౌల‌భ్యం కొర‌కు సుప‌థం, వ‌సంత‌మండ‌పం, మేద‌ర‌మిట్ట‌, అన్న‌దానం కాంప్లెక్స్ ప్రాంతాల్లో ప్ర‌త్యేక క్యూలైన్లు ఏర్పాటుచేసి భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించాం.

– గ‌రుడ‌సేవ‌రోజు ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్త‌కుండా తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాల్లో వాహ‌నాల పార్కింగ్ ప్ర‌దేశాల‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటుచేశాం.

– ఆరోజున వ‌చ్చిన ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు ప‌లుర‌కాల అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, పాలు, టీ, కాఫీ పంపిణీ చేశాం. మ‌రుగుదొడ్ల స‌మ‌స్య లేకుండా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నాం.

– బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌యవంతం చేయ‌డంలో పాలుపంచుకున్న మా అధికారులు, సిబ్బంది, క‌ళాకారులు, శ్రీ‌వారి సేవ‌కులు, ఎన్‌సిసి విద్యార్థుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

– అలాగే, బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు అన్నివిధాలా స‌హ‌క‌రించిన జిల్లా యంత్రాంగం, పోలీసు, ఆర్‌టీసీ, ఇత‌ర ప్ర‌భుత్వ విభాగాల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.

– బ్ర‌హ్మోత్స‌వాల వైభ‌వాన్ని భ‌క్తుల‌కు చేరువ చేసిన మీడియా మిత్రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.

మీడియా స‌మావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ వెంకటసుబ్బ‌రాజు, శ్రీ యానాద‌య్య‌, శ్రీ దేశ్‌పాండే, శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, శ్రీ తిప్పేస్వామి, శ్రీ వెంకటసతీష్ కుమార్, శ్రీ అశ్వర్థ నాయక్, శ్రీ నాగసత్యం, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్, సిఇ శ్రీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.