ADDL. EO INSTRUCTS FOR QUICK REFUNDING PROCESS OF CDs TO DEVOTEES _ భక్తుల ఖాతాలో.మరింత త్వరగా కాషన్ డిపాజిట్ రీఫండ్ సొమ్ము

  • ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు ఈవో ఆదేశం

TIRUMALA, 19 AUGUST 2021: The Additional EO of TTD Sri AV Dharma Reddy instructed the IT officials to ensure quick refunding of Caution Deposits directly to the Bank Accounts of devotees as soon as they vacate rooms.

A review meeting on IT department activities was held at Gokulam Rest House in Tirumala on Thursday evening. Speaking on the occasion the Additional EO said that the caution deposits are being refunded to the respective bank accounts of devotees within 12 hours of their vacation. But due to the process involved in depositing the amount from bank to vendor and from there to devotee account, it is taking three to four days.

He directed the concerned officials to negotiate with the Banks to speed up the refund process. The Additional EO also said to set up an exclusive phone number for the sake of devotees, if they don’t get a refund even after four days. He told the officials to bring the exclusive number 9966812345 for Complaint Tracking System to resolve accommodation to the utility of devotees. Security Audit of the software application should be carried out regularly for offering better pilgrim services, he added.

The Additional EO also directed the IT officials to design an exclusive Software application to provide an aesthetic feel of a virtual tour of Tirumala Pilgrimage with all the necessary information. He also said the IT department staff should be given training with experts from renowned IT companies and to select suitable candidates among the employees who are qualified in IT to strengthen the Data Centre of TTD. The Additional EO directed the IT officials to give an opportunity to the IT students in Engineering Colleges as Interns in TTD.

Later he also reviewed the Donor Cell application and directed the officials to make the software app more user-friendly.

GM IT Sri Sesha Reddy, CIO Sri Sandeep Reddy, DyEOs Sri Ramesh Babu, Sri Lokanatham, Sri Bhaskar, Smt Padmavathi were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తుల ఖాతాలో.మరింత త్వరగా కాషన్ డిపాజిట్ రీఫండ్ సొమ్ము
– ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు ఈవో ఆదేశం

 తిరుమల 19 ఆగస్టు 2021: తిరుమలలో వసతి పొందిన భక్తులు గది ఖాళీ చేశాక కాషన్ డిపాజిట్ త్వరగా వారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

గోకులం అతిథి గృహంలో గురువారం సాయంత్రం ఆయన ఐటి విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులు గది ఖాళీ చేసిన 12 గంటల్లోగా కాషన్ డిపాజిట్ టీటీడీ వారి ఖాతాకు జమ చేయడం జరుగుతోందన్నారు. అయితే బ్యాంకు నుంచి వెండార్ కు, వెండార్ నుంచి భక్తుడి ఖాతాలో జమ కావడానికి మూడు రోజుల సమయం పడుతోందని చెప్పారు. ఇంకా త్వరగా కాషన్ డిపాజిట్ భక్తుల ఖాతాలో జమ అయ్యేలా బ్యాంక్ అధికారులతో.మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నాలుగు రోజుల్లో కాషన్ డిపాజిట్ తిరిగి రాకపోతే భక్తులే ఫోన్ చేసి అడిగేందుకు వీలుగా ఒక మొబైల్ నంబర్ ఏర్పాటు చేయాలని శ్రీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుమలలో గదులు పొందిన భక్తులు ఆ గదుల్లో వసతికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయడానికి వీలుగా 9966812345 నంబర్ అందుబాటులోకి తేవాలన్నారు. గదుల్లో వసతులకు సంబంధించి ప్రస్తుతానికి భక్తుల నుంచి చాలా తక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, ఇవి కూడా రాకుండా ఎఫ్ ఎమ్ ఎస్ అధికారులు పని చేయాలని అదనపు ఈవో సూచించారు.

తిరుమలలో గదుల లభ్యత, మరమ్మతుల వివరాలు తెలిపేలా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారు చేయాలని ఐటి అధికారులను ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశ్యంతో తయారు చేసిన సాఫ్ట్వేర్ అప్లికేషన్లను క్రమం తప్పకుండా సెక్యూరిటి ఆడిట్ చేయించాలని ఆయన చెప్పారు.

తిరుపతిలో భక్తులు దిగగానే తిరుమల యాత్ర గొప్ప అనుభూతి కల్పించేలా చేయడానికి సకల సమాచారంతో కూడిన వర్చువల్ టూర్ లాంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ రూపొందించాలన్నారు. టీటీడీలో పలు విభాగాలకు సంబంధించిన కేబుల్స్ ఎలా పడితే అలా ఉంచకుండా, క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

టీటీడీ డేటా సెంటర్ ను బలోపేతం చేయాలని, ఇందుకోసం టీటీడీలోని క్వాలిఫైడ్ సిబ్బందిని ఎంపిక చేసి అవసరమైతే ప్రోత్సాహకాలు ఇద్దామని ఆయన అన్నారు. టీటీడీలోని ఐటి విభాగం సిబ్బందికి శిక్షణ ఇప్పించడానికి దేశంలోని ప్రముఖ ఐటి సంస్థల నుంచి నిపుణులను ఆహ్వానించాలని చెప్పారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఐటి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కల్పించేలా ఏర్పాట్లు చేయాలని ఐటి అధికారులను ఆయన ఆదేశించారు.

డోనార్ సెల్ కు వివిధ ట్రస్ట్ లకు విరాళాలు ఇస్తున్న భక్తుల కోసం యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా సాఫ్ట్వేర్ ను మార్పులు చేయాలని ఆయన చెప్పారు.

ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సందీప్, డిప్యూటీ ఈవో లు శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్, శ్రీ రమేష్, శ్రీమతి పద్మావతి ఈ సమీక్ష లో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.