SAFETY AND SECURITY OF DEVOTEES IS OUR TOP PRIORITY -TTD CHAIRMAN _ భక్తుల ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు- టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డిభక్తుల ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు

TIRUPATI, 14 AUGUST 2023: The safety and security of Devotees is the top most priority of Tirumala Tirupati Devasthanams said TTD chairman Sri B Karunakara Reddy.

After holding a high-level meeting with TTD, District and forest officials at Sri Padmavathi Rest House in Tirupati on Monday evening, the TTD chairman along with TTD Executive Officer Sri AV Dharma Reddy briefed the media on various important decisions taken by TTD.

The parents with children aged below 12 years will be allowed to trek the footpath routes only between 5am and 2pm only. The other devotees will be allowed till 10pm.

As a safety measure, each devotee trekking the footpath will be provided with a wooden stick as a self-defence measure.

The two-wheelers will be allowed to ply on ghat roads only between 6am and 6pm.

For the safety of devotees, the forest staff who have expertise in tackling wild animals attacks will be appointed.

Devotees will be allowed in groups only by giving a security guard.

The practice of offering food items to animals  is strictly banned and action will be initiated against those who are selling such food items also

The hoteliers along the footpath routes are strictly instructed not to throw away or dump food wastes.

500 CC Cameras are being installed in both the footpath routes and if necessary Drone cameras will also be procured.  24/7 wildlife outposts with animal trackers and doctors will be made available round the clock.

Focus lights to be installed in such a way that the light is visible for 30m in the surrounding areas.

About fencing, the final call is to be given by Forest authorities as per Wild Act. After we receive the report from them, we will act accordingly.

Singnages about wild beasts attacks and cautions to be placed at Seventh Mile,  Galigopuram, Alipiri etc.

Henceforth there is no need for the Alipiri trekkers to scan their Divya Darshan tokens and they can reach Tirumala by road also

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, Principal Chief Conservator Smt Shantipriya Pandey, SP Sri Parameshwar Reddy, Joint Collector Sri.Balaji,

CCF Sri Nageswara Rao, CE Sri Nageswara Rao, TTD DFO Sri Srinivas, DFO Sri Satish and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

భక్తుల ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు

– దివ్యదర్శనం టోకెన్ల భక్తులు రోడ్డుమార్గంలోనూ వెళ్లొచ్చు

– టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి, 2023 ఆగస్టు 14: తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా వారి ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాలినడక మార్గాలు, ఘాట్‌లలో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో, ఎస్పీ, అటవీ శాఖ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్లలోపు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులతో సహా అనుమతిస్తామన్నారు. పెద్దవారిని రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తామని చెప్పారు. నడకదారి భక్తులకు సహాయకారిగా ఉండేలా ప్రతి ఒక్కరికీ ఊతకర్ర ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తామని తెలిపారు.

భక్తుల రక్షణకు గాను అటవీ శాఖ ఆధ్వర్యంలో నిపుణులైన అటవీ సిబ్బందిని నియమించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తులను గుంపులుగా పంపుతామని, వీరికి సెక్యూరిటీ గార్డులు భద్రతగా ఉంటారని చెప్పారు. సాధు జంతువులకు ఆహారపదార్థాలు అందించడాన్ని, అలాచేసే వారిపైనా, ఆహార పదార్థాలు విక్రయించే వారిపైనా చర్యలు తీసుకుంటామని వివరించారు. నడకదారుల్లో ఉన్న హోటళ్ల నుండి వ్యర్ధాలు వదిలివేయకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

నడకదారుల్లో 500 కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశామని, అవసరమైతే డ్రోన్లను కూడా వినియోగిస్తామని తెలిపారు. వైల్డ్ లైఫ్ అవుట్ పోస్టులు 24/7 ఏర్పాటు చేసి అనిమల్ ట్రాకర్స్, డాక్టర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. రోడ్డుకిరువైపులా 30 అడుగుల దూరం కనిపించేలా ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫెన్సింగ్ ఏర్పాటుకు అటవీ శాఖ కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తారని, అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రూరమృగాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు అలిపిరి, గాలిగోపురం, ఏడో మైలు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు.

తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద రోజుకు 15 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, మధ్యలో వీటిని స్కానింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గంలో కూడా తిరుమలకు వెళ్లవచ్చని చెప్పారు.

ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, అటవీ శాఖ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శ్రీమతి శాంతిప్రియ పాండే, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ, తిరుపతి సిసిఎఫ్ శ్రీ పి.నాగేశ్వరరావు, ఎస్వీ జూపార్క్ క్యూరేటర్ శ్రీ సి.సెల్వం, తిరుపతి డిఎఫ్ఓ శ్రీ జి.సతీష్, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.