OPERATION CHIRUTA TO CONTINUE FOR DEVOTEES SAFETY- TTD CHAIRMAN _ భక్తుల భద్రత కోసం ఆపరేషన్ చిరుత కొనసాగిస్తాం – భక్తుల చేతికి కర్ర ఇచ్చి బాధ్యత నుండి తప్పించుకోము

NO PLANS TO ESCAPE RESPONSIBILITY BY JUST GIVING STICKS TO DEVOTEES

Tirumala,17 August 2023: TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy said the Operation Chiruta will be a continuous affair for the safety of devotees coming for Srivari Darshan round the year.

 

Earlier on Thursday the Chairman along with TTD EO Sri AV Dharma Reddy visited the spot where forest officials had captured and interacted with forest officials.

Later speaking to reporters he said action plan will be conceived to ensure safety to all devotees walking through the forest area and implement it through out the year.

He said as per forest officials a male wild cat was caught in the bone trap at around 1.30 am. About 300 CC cameras were already installed in the forest footpath and another 200 will soon be rolled out. 

He found fault with social media criticism on the proposal of providing sticks to walkers on footpaths as suggested by the forest officials. He asserted that there was no attempt on the part by TTD to escape its responsibility of safeguarding the devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తుల భద్రత కోసం ఆపరేషన్ చిరుత కొనసాగిస్తాం – భక్తుల చేతికి కర్ర ఇచ్చి బాధ్యత నుండి తప్పించుకోము

టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

తిరుమల 17 ఆగస్టు 2023: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా ఆపరేషన్ చిరుతను కోనసాగిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు . తిరుమల నడకదారిలో గురువారం తెల్లవారు జామున చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే.

టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి తో కలసి శ్రీకరుణాకర రెడ్డి గురువారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు . అటవీ శాఖ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. తిరుమల అటవీ ప్రాంతంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్యచరణ రూపొందించి, అమలు చేస్తామన్నారు.

వేకువజామున 1:30 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కిందని చెప్పారు.
బోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా అధికార్లు నిర్దారించారని ఆయన చెప్పారు.
భక్తులకు భధ్రత కల్పిస్తూనే, నడక మార్గం లోకి వచ్చే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ చెప్పారు.

అటవీ శాఖ అధికారుల ప్రతిపాదన మేరకే నడచి వచ్చే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. భక్తుల భద్రత లో భాగంగా అటవీ శాఖ సూచనల మేరకు అడవి లో 300 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, మరో 200 కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

భక్తులకు కర్రలు ఇచ్చి టీటీడీ తన భాధ్యత నుంచి తప్పించుకుంటోందని సోషియల్ మీడియాలో విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది