RATHOTSAVAM HELD AT CHENNAI _ భక్తుల మనోరథాన్ని అధిరోహించిన సిరుల తల్లి

TIRUPATI, 24 FEBRUARY 2025: On Monday, Sri Padmavathi Devi in all Her resplendence, took out a celestial ride on Ratham to bless devotees.
 
As a part of the ongoing annual brahmotavams in Sri Padmavathi Ammavari temple at Chennai, the Goddess decked in colourful robes and ornaments paraded on the chariot.
 
AEO Sri Parthasaradhi, Superintendent Smt Pushpalata and others were present.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన సిరుల తల్లి

చెన్నై / తిరుపతి, 2025 ఫిబ్రవరి 24: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం ఉద‌యం 9.30 గంట‌లకు రథోత్సవం కన్నుల పండుగ‌గా జరిగింది.

రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.

రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.