SCHOLARS HAIL TIRUMALA NAMBI SERVICES _ భగవంతుడి సేవే పరమావధిగా శ్రీ తిరుమలనంబి కైంకర్యం :- శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి
TTD ADDNL EO LAUDS NAMBI FOR THEERTHA KAINKARYAM
Tirumala,09 September 2024: The pontiff of Ahobilam Mutt Sriman Srivan Shatahopa Ranganatha Yatindra Maha Desikan Swamy hailed the contributions of Sri Tirumala Nambi who spent his entire life in Srivari Kainkaryas.
Participating in the 1051th Avatarotsavam of Sri Tirumala Nambi at the Tirumala Nambi temple on South Mada Street, the seer said upon the directions of Sri Yamunacharya, Tirumala Nambi even at ripe age trekked to Papavinasam every day to fetch water for Srivari Abhisekam.
Puranas says that Srivaru conceived Akashaganga for Abhishekam to help His ardent devotee Nambi.
Speaking on the occasion TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary said Tirumala Nambi reached Tirumala in 973AD and launched Theertha kainkarya, Mantra Kainkaryas, Veda parayana Kainkarya and others Kainkaryas.
He said in recognition of the contributions of Srivari favourite devotee every year TTD observed Mahotsavam at the sub-shrine in Tirumala. Thereafter 16 eminent pundits from Telangana, Tamil Nadu, Karnataka and Kerala paid rich tributes to Tirumala Nambi at Tirumala.
TTD Dharmic projects program officer Sri Rajagopal, Alwar Divya Prabandha project program officer Sri Purushottam, descendants of Sri Tirumala Nambi Sri Tatacharya Krishna Murthy and Sri C Ranganathan and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భగవంతుడి సేవే పరమావధిగా శ్రీ తిరుమలనంబి కైంకర్యం :
– శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి
శ్రీవారికి తీర్థ కైకర్యం చేసిన తిరుమల ప్రథమ పౌరుడు శ్రీ తిరుమలనంబి :
– టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య్య చౌదరి
తిరుమల, 2024 సెప్టెంబరు 09: భగవంతుడి సేవే పరమావధిగా భావించి శ్రీ తిరుమలనంబి జీవితం మొత్తాన్ని శ్రీవారి కైంకర్యానికి అంకితం చేశారని శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి అన్నారు. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం సోమవారం తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి అనుగ్రహభాషణం చేస్తూ, శ్రీ తిరుమలనంబి తన తాతగారు అయిన శ్రీ యమునాచార్యుల ఆజ్ఞతో తిరుమలకు వచ్చి పాపవినాశనం తీర్థం నుండి ప్రతిరోజూ జలాన్ని తీసుకువచ్చి శ్రీవారిని అభిషేకించేవారన్నారు. వృద్ధాప్యంలో కూడా పాపనాశనం తీర్థం నుండి తీసుకువస్తునప్పుడు స్వామివారు జాలిపడి అంజనాద్రిలో ఉద్భవింపచేసిన ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేయవలసిందిగా ఆజ్ఞాపించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించిన భగవద్గీతలోని 700 శ్లోకాలను సంగ్రహించి శ్రీ యమునాచార్యులు 32 శ్లోకాలతో గీతార్థ సంగ్రహం పేరుతో గ్రంథం రచించారని చెప్పారు. ఈ శ్లోకాలు బ్రహ్మవిద్యతో సమానమైనవని కొనియాడారు.
అనంతరం టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య్య చౌదరి మాట్లాడుతూ, శ్రీవేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైకర్యం చేసిన తిరుమల ప్రథమ పౌరుడు శ్రీ తిరుమలనంబి అని అన్నారు. శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమలనంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. తిరుమలనంబి స్వామివారికి పుష్పకైంకర్యం, మంత్రపుష్పకైంకర్యం, వేదపారాయణ కైకర్యం, ఇతర కైంకర్యాలను చేస్తూ తిరుమలలో ఉంటూ అపరభక్తుడిగా నిలిచాడని చెప్పారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా చాటడానికి కృషి చేసిన పరమ భక్తుల జన్మదినాల సందర్భంగా ప్రతి సంవత్సరం వారి పేరుపై ఉన్న ఉప ఆలయాల్లో వార్షికోత్సవాలు టీటీడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
అనంతరం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల నుండి విచ్చేసిన 16 మంది ప్రముఖ పండితులు శరణాగతి తత్వాన్ని గురించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రోగ్రాం అధికారి శ్రీ పురుషోత్తం, శ్రీ తిరుమలనంబి వంశీకులు శ్రీ తాతాచార్య కృష్ణమూర్తి, శ్రీ సి.రంగనాథన్, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.