TTD CHAIRMAN OFFERS PATTU VASTRAMS TO BHADRADRI SRI RAMA _ భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్
PARTICIPATES IN THE CELESTIAL KALYANAM ALONG WITH CM OF TS
Tirumala, 06 April 2025: On the auspicious occasion of Sri Ramanavami, TTD Chairman Sri B.R. Naidu on Sunday offered Pattu Vastrams to Bhadrachalam temple located in Telangana state to commemorate the celestial marriage of Sri Sita Rama.
It is a tradition for TTD to offer silk clothes every year on this divine occasion.
The TTD Chairman, who first reached the Bhadrachalam temple, was welcomed by TS Endowments Minister Smt. Konda Surekha, Agriculture Minister Sri Tummala Nageswara Rao and EO Smt. L. Ramadevi with temple traditions.
After offering the vastrams, the TTD Chairman participated in the celestial marriage of Sri Sita Devi and Sri Ramachandra Murty along with the Honourable CM of Telengana State Sri Revanth Reddy.
Earlier, at the local ITC guest house, the TTD Chairman was felicitated with shawls by Telangana State Deputy CM Sri Bhatti Vikramarka, Revenue Minister Shri Ponguleti Srinivasa Reddy and Collector Sri Jitesh Patil.
TTD Bokkasam In-charge Sri Guru Raja Swamy and other officials participated in the program.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్
భద్రాచలం/తిరుమల, 2025 ఏప్రిల్ 06: శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవారికిి ఆదివారం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు.
ప్రతి సంవత్సరము టీటీడీ తరుపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ముందుగా భద్రాచలం ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఛైర్మన్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, ఈవో శ్రీమతి ఎల్ .రమాదేవి ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం టీటీడీ ఛైర్మన్ దంపతులు సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు.
అంతకుముందు స్థానిక ఐటీసీ అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్ ను తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ శ్రీ జితేష్ పాటిల్ లు శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బొక్కసం ఇంఛార్జి శ్రీ గురు రాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.